మా వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదు.. అన్నీ కలిపేస్తాం: చైనా

బీజింగ్: తమ వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదని, వాటిని మరింత సమర్థంగా మార్చేందుకు వ్యాక్సిన్ల మిశ్రమాన్ని తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చైనా అధికారి వెల్లడించడం గమనార్హం. వ్యాక్సిన్లపై ఆ దేశం నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం చాలా అరుదైన విషయం. చైనా వ్యాక్సిన్లకు ఎక్కువ రక్షణ కల్పించే శక్తి లేదు అని చైనా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ గావో ఫు వెల్లడించారు. చెంగ్డులో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వాస్తవాన్ని బయటపెట్టడం గమనార్హం. ఇండియాతోపాటు వివిధ దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం చేస్తూ తమ వ్యాక్సిన్లను ప్రమోట్ చేసుకోవడానికి చైనా చాలా తంటాలు పడింది. ఇప్పటికే కోట్లాది వ్యాక్సిన్లను వివిధ దేశాలకు సరఫరా కూడా చేసింది.
అలాంటిది ఇప్పుడు తమ వ్యాక్సిన్లే సరిగా పని చేయడం లేదని చైనా నోటి నుంచే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచడానికి వివిధ వ్యాక్సిన్లను కలిపే ఆలోచన కూడా చేస్తున్నట్లు గావో ఫు చెప్పారు. చైనాకు చెంది సినోవాక్ వ్యాక్సిన్ సామర్థ్యం కేవలం 50 శాతమే అని బ్రెజిల్ చేసిన అధ్యయనంలోనూ తేలింది. అయినా చైనా మాత్రం ఇప్పటి వరకూ తమ వ్యాక్సిన్లు తప్ప ఇతర దేశాల వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వలేదు.
చైనా సాంప్రదాయ విధానాలు అనుసరించి వ్యాక్సిన్లను తయారు చేసింది. అయితే తాజాగా పాశ్చాత్య దేశాల టెక్నిక్ అయిన ఎంఆర్ఎన్ఏను ఉపయోగించనున్నట్లు గావో ఫు చెప్పడం గమనార్హం. ఈయనే గతంలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 2వ తేదీ వరకూ చైనాలో మొత్తం 16 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

