మక్తల్, జనవరి 30 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) సత్తా చాటాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి(Chittem Rammohan Reddy )పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నేతాజీనగర్‌లో రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో మున్సిపాలిటీలోని 14వ వార్డుకు చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన అందిస్తుందని ధ్వజమెత్తారు.
త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో రేవంత్ సర్కారుకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. గులాబీ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ వ్రేణులంతా సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. రాబోయే రోజులన్నీ మనవే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..