టెహ్రాన్: ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి చాలామంది భారత విద్యార్థులను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ దేశంలోని మన దౌత్య కార్యాలయం మంగళవారం తెలిపింది. రవాణా, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించినట్టు పేర్కొంది.
అయితే కొద్దిమంది విద్యార్థులు వేరే ప్రాంతానికి రావడానికి అయిష్టత వ్యక్తం చేశారని, తాము టెహ్రాన్‌లోనే ఉంటామని చెప్పారని తెలిపింది. యుద్ధం కారణంగా ఏర్పడే ముప్పును తప్పించడానికే విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్టు పేర్కొంది.