VISA rules : అగ్ర రాజ్యం అమెరికా (USA) లో వీసా సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా వీసా విధానాల్లో మార్పులు, లేట్ అప్రూవల్‌లు, ప్రాసెసింగ్ టైమింగ్స్ పెరగడంవల్ల ఎన్నో ఆందోళనలు పెరిగాయి. అక్కడ చాలామంది భారతీయులు H1B, L1 వంటి వీసాలపై పనిచేస్తున్నారు. కానీ వీసా పొందడం, వీసా ఎక్స్టెన్షన్ లేదా ట్రాన్స్ఫర్లో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దాంతో వలసదారులు వారి కుటుంబాలను మిస్ అవుతున్నారు. కార్మిక హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ క్రమంలో ఐటీ నిపుణులకు మంచి అవకాశం ఇచ్చేందుకు న్యూజిలాండ్ (Newzealand) కొత్త వీసా నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉద్యోగులను తమ దేశంలోకి రప్పించేందుకు న్యూజిలాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా ఐటీ నిపుణులకు ఆకర్షణీయమైన వీసా నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనలు భారత ఐటీ నిపుణులకు బంపర్ ఆఫర్‌గా చెప్పవచ్చు.
అమెరికాలో ఇండియన్ వర్క్ వీసా సంబంధిత నియమాలు మారడంతో అనేక మంది వలసదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు కఠినంగా మారినందున న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశంలో స్థిరపడాలని ఆశపడేవారి ఆలోచనలను మార్చుకునేలా చేశాయి. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ హక్కు రద్దు, గ్రీన్ కార్డు, వీసా నిబంధనలను కఠినతరం చేయడం లాంటి నిర్ణయాలు ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపించాయి. భారతదేశం నుంచి ఎక్కువగా ఐటీ ఉద్యోగులు తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Salwan Momika | 2023లో ముస్లిం దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమైన వ్యక్తి దారుణ హత్య..!
Congress MP | మహిళపై నాలుగేళ్లుగా అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
Chandigarh Mayor | చండీగఢ్ నూతన మేయర్‌గా హర్‌ప్రీత్ కౌర్ బబ్లా.. Video
Mahakumbh | తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్, డీజీపీ.. Video
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు