Congress MP : మహిళపై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాకేశ్ రాథోడ్ (Raksh Rathore) అరెస్టయ్యారు. బుధవారం రాకేశ్ అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అంతకుముందు సీతాపూర్ (Sitapur) లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కూడా రాకేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.
అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు రాకేశ్ రాథోడ్ గురువారం ఉదయం పోలీసుల ముందు లొంగిపోయారు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. రాకేశ్ రాథోడ్ గత లోక్‌సభ ఎన్నికల్లో సీతాపూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో రాకేశ్ రాథోడ్.. పెళ్లి చేసుకుంటానని, రాజకీయ భవిష్యత్తు ఇస్తానని మాయ మాటలు చెప్పి గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ రాకేశ్ రాథోడ్‌కు, తనకు మధ్య ఫోన్ కాల్ వివరాలను, కాల్ రికార్డింగులను కూడా ఆమె పోలీసులకు అందజేశారు. పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు. దాంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఈ నెల 23న ఎంపీ ఎమ్మెల్యే కోర్టును, బుధవారం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ దొరకకపోవడంతో ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గతవారం బాధితురాలి భర్త కూడా పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. కేసును వాపస్ తీసుకోవాలని ఎంపీ, ఆయన కుమారుడు ఒత్తిడి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Chandigarh Mayor | చండీగఢ్ నూతన మేయర్‌గా హర్‌ప్రీత్ కౌర్ బబ్లా.. Video
Mahakumbh | తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్, డీజీపీ.. Video
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు
Maha Kumbh Stampede | బారీకేడ్లను తొలగించడంవల్లే తొక్కిసలాట : మహా కుంభమేళా డీఐజీ
Drinking water | ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అడ్డంకి..!