Mahakumbh : మహా కుంభమేళా (Mahakumbh) లో తొక్కిసలాట (Stampede) జరిగిన ప్రాంతాన్ని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ మనోజ్‌కుమార్ సింగ్ (Manoj Kumar Singh), డీజీపీ ప్రశాంత్ కుమార్ (Prashant Kumar) పరిశీలించారు. గురువారం ఉదయం ఉన్నతాధికారులు ఇద్దరూ తమ సిబ్బందితో ఘటనా ప్రాంతానికి వెళ్లారు. మహా కుంభమేళాలో భాగంగా మౌని అమావాస్య (Mouni Amavasya) రోజు జరిగే రెండో అమృత స్నానాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడమే తొక్కిసలాటకు కారణమని తేలడంతో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంపై వారు దృష్టిసారించారు.
మహా కుంభమేళాలో భాగంగా మొత్తం నాలుగు అమృత స్నానాలు ఉంటాయి. ఇప్పటివరకు రెండు అమృత స్నానాలు ముగిశాయి. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా రెండో అమృత స్నానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అంచనాలకు మించి భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా మూడో అమృత స్నానాలు జరగనున్నాయి. ఆ రోజు కూడా భక్తులు భారీగా అమృత స్నానాలకు తరలివచ్చే అవకాశం ఉంది.
దాంతో మళ్లీ తొక్కిసలాట లాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేశారు. కాగా బుధవారం తెల్లవారుజామున 1-2 గంటల మధ్య మౌని అమావాస్య సందర్భంగా భక్తులు అమృత స్నానాల కోసం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 60 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
#WATCH | Prayagraj, UP: DGP Prashant Kumar and Chief Secretary Manoj Kumar Singh arrive in Prayagraj to inspect the stampede that occurred on 29 January on the occasion of Mauni Amavasya.
They will also oversee the security arrangements ahead of the third Amrit Snan scheduled… pic.twitter.com/0pKsn8ULz8
— ANI (@ANI) January 30, 2025
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు
Maha Kumbh Stampede | బారీకేడ్లను తొలగించడంవల్లే తొక్కిసలాట : మహా కుంభమేళా డీఐజీ
Drinking water | ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అడ్డంకి..!