Maha Kumbh Stampede : మహా కుంభమేళా (Mahakumbh) తొక్కిసలాట (Stampede) లో మొత్తం 30 మంది మరణించారని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన వివరాలను మహా కుంభమేళా డీఐజీ (DIG) వైభవ్ కృష్ణ (Vaibhav Krishna) మీడియాకు వెల్లడించారు. తొక్కిసలాటలో మొత్తం మరణాల సంఖ్య 30కి పెరిగిందని, మరో 36 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
మృతుల్లో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించాల్సి ఉందని డీఐజీ చెప్పారు. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట రెండు గంటల మధ్య తొక్కిసలాట జరిగిందని ఆయన వెల్లడించారు. మౌని అమావాస్య నేపథ్యంలో భక్తులు ఊహించిన దానికింటే అధిక సంఖ్యలో పుణ్య స్నానాలకు తరలివచ్చారని, రద్దీ పెరగడంతో పలుచోట్ల బారీకేడ్లను తొలగించారని, అదే తొక్కిసలాటకు దారితీసిందని వైభవ్ కృష్ణ తెలిపారు.
కాగా, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ దగ్గర త్రివేణి సంగమంలో ఈ నెల 13న మహా కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి వరకు ఈ మహా కుంభమేళా కొనసాగనుంది. మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మహా కుంభమేళాకు భక్తులు అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ నెల 28 వరకు అంటే కేవలం 16 రోజుల్లోనే 19.94 కోట్ల మంది ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. ఇక బుధవారం మౌని అమావాస్య కావడంతో ఒక్కరోజే దాదాపు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
Drinking water | ఫిబ్రవరి 1న హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు అడ్డంకి..!
Road accident | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు దుర్మరణం
PM Modi | ‘ఫిబ్రవరి 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది’.. ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం