PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం మొదలుపెట్టారు. బుధవారం ఘోండా నియోజకవర్గం (Ghonda Assembly constituency) లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని చెప్పారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్ సర్కారు పోయి, బీజేపీ సర్కారు వస్తుందని జోస్యం చెప్పారు. ఈ మాట తాను మాత్రమే చెప్పడం లేదని యావత్ ఢిల్లీ ప్రజలంతా అదే అంటున్నారని అన్నారు.
ఢిల్లీ ప్రజలు ఇంటింటికి నల్లా నీళ్లు కావాలని, ట్యాంకర్ మాఫియా నుంచి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారని ప్రధాని చెప్పారు. గత 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ వారి ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఆప్ అబద్ధపు హామీలను ఇప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వారంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ సభకు హాజరైన జన సంఖ్యే చెబుతోందని అన్నారు. ఢిల్లీ బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రధాని మెచ్చుకున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేలా మ్యానిఫెస్టో ఉన్నదని అన్నారు.
21వ శతాబ్దంలో ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్లు, ఆప్ 11 ఏళ్లు పాలించాయని.. అయినా ఢిల్లీ ప్రజల బతుకుల్లో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదని ప్రధాని మోదీ విమర్శించారు. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, పేలవమైన మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, కాలుష్యం, మురుగునీరు తదితర సమస్యలు ఢిల్లీ ప్రజలను వేధిస్తున్నాయని అన్నారు. కాగా దాదాపు 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ.. ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారం తమదేనని ఆప్ కూడా ధీమాతో ఉంది.
Income Tax | ట్రంప్ కీలక ప్రతిపాదన.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు!
ఇక వారానికి నాలుగు రోజులే పని.. బ్రిటన్‌లో 200 కంపెనీలో కీలక నిర్ణయం!
Milk | చిన్న పిల్లలకు ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా?