న్యూఢిల్లీ : భారత్లో వారానికి 70 పని గంటలపై ఒక పక్క విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్లో దాదాపు 200 కంపెనీలు వారానికి 4 పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నాయి. వారానికి ఇక 4 రోజులే పని అనే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు 5,000 మందికిపైగా ఉద్యోగులున్న సుమారు 200 కంపెనీలు ఒక ఒప్పందంపై సంతకం చేసినట్టు గార్డియన్ పత్రిక వెల్లడించింది.
ది 4 డే వీక్ ఫౌండేషన్ చేపట్టిన ప్రచారానికి మార్కెటింగ్, టెక్నాలజీ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలతోసహా వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీలు మద్దతు తెలిపాయి. వారంలో నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తే ఉత్పాదకత మెరుగుపడుతుందని ఫౌండేషన్ తెలిపింది.