Mallikarjun Kharge : మహా కుంభమేళా (Maha Kumbh) లో తొక్కిలాట (Stampede) చోటుచేసుకుని 14 మంది మరణించిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయాధ్యక్షుడు (National President) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. కుంభమేళాకు యూపీ ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేసిందని, వరుస కట్టిన వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దాంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇవే తొక్కిసలాటకు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. అంతేగాక కుంభమేళా ఏర్పాట్లపై ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం కూడా ఘటనకు మరో కారణంగా చెప్పుకోవచ్చని విశ్లేషించారు.
మహా కుంభమేళాలోని తీర్థరాజ్ సంగం తీరంలో తొక్కిసలాట జరిగి 14 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయాలపాలు కావడం బాధకరమైన విషయమని, ఆ వార్త గుండెలను పిండేసిందని ఖర్గే అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా ఏర్పాట్లు సరిగా చేయకపోవడం తీవ్రంగా ఖండించదగిన విషయం.
మహా కుంభమేళాలకు వీఐపీల రాకను అదుపు చేయాలని ఖర్గే సూచించారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఏర్పాట్లను మెరుగుపర్చాలన్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. మౌనీ అమావాస్య సందర్భంగా సంగం ఘాట్లలో పుణ్యస్నానాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని, అదే తొక్కిసలాటకు కారణమైందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు.
Income Tax | ట్రంప్ కీలక ప్రతిపాదన.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు!
ఇక వారానికి నాలుగు రోజులే పని.. బ్రిటన్లో 200 కంపెనీలో కీలక నిర్ణయం!
Milk | చిన్న పిల్లలకు ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా?