Drinking water : హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలోని పలు ప్రాంతాలకు ఫిబ్రవరి 1న తాగునీటి (Drinking water) సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. నసర్లపల్లి సబ్‌స్టేషన్ (Nasarlapalli Substation) లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ (132 KV bulk load feeder PT) కి మరమ్మత్తులు చేయాల్సి ఉందని, ఫిబ్రవరి 1న తెలంగాణ ట్రాన్స్‌కో (TG Transco) అధికారులు మరమ్మత్తులు చేయనున్నారని, అందువల్ల ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తాగునీటి సరఫరా సాధ్యపడదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (Hyderabad Metropolitan Water Supply & Sewerage Board) తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫీడర్ పరిధిలోని రిజర్వాయర్లు, కృష్ణా ఫేజ్ 1, 2, 3 ల ద్వారా తాగునీరు సరఫరా అయ్యే ఏరియాలకు ఫిబ్రవరి 1న ఆరు గంటలపాటు పాక్షికంగా అంతరాయం ఏర్పడనుందని బోర్డు తన ప్రకటనలో పేర్కొన్నది. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్న ఏరియాల్లో మీరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ, శాస్త్రిపురం, సంతోష్‌నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకుత్‌పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, భోజగుట్ట, షేక్‌పేట్, బొగ్గుల కుంట, అఫ్జల్‌గంజ్, ఆళ్లబండ, నారాయణగూడ, అడిక్‌మెట్, శివమ్రోడ్, చిలుకలగూడ, జూబ్లీహిల్స్, ఫిలిమ్ నగర్, ప్రశాసన్ నగర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడుపల్లి, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, రియాసత్ నగర్ ఉన్నాయి.
వీటితోపాటు అలియాబాద్, బండ్లగూడ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్ నగర్, సాహెబ్ నగర్, వైశాలినగర్, అల్కపురి, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మహేంద్ర హిల్స్, రామాంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకనగర్, దేవేందర్ నగర్, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, దుర్గానగర్, బుద్వేల్, గోల్డెన్ హైట్స్, హార్డ్‌వేర్ పార్క్, భరత్ నగర్, ఆనంద్ నగర్ క్రాస్ రోడ్స్, ఫీర్జాదీ గూడ, మీర్పేట్, కుర్మగూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 1న తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఏరియాలకు చెందిన వినియోగదారులు ఆ రోజు తాగునీటిని నిలువ ఉంచుకోవాలని బోర్డు సూచించింది.
Road accident | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు దుర్మరణం
PM Modi | ‘ఫిబ్రవరి 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది’.. ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
Income Tax | ట్రంప్ కీలక ప్రతిపాదన.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు!
ఇక వారానికి నాలుగు రోజులే పని.. బ్రిటన్‌లో 200 కంపెనీలో కీలక నిర్ణయం!
Milk | చిన్న పిల్లలకు ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా?