Bomb Threat | హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. గురువారం ఉదయం సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఓ ఆగంతకుడు ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. బాంబు బెదిరింపు కాల్ ఓ బూటకమని తేల్చారు. బెదిరింపులకు పాల్పడింది తెలంగాణలోని కామారెడ్డి (Kamareddy)కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి మతిస్థిమితం లేదని అధికారులు తేల్చారు.
Also Read..
Mahatma Gandhi | మహాత్మా గాంధీ వర్ధంతి.. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Maha Kumbh Mela | మహాకుంభమేళా.. 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు
Cosmetic Products: లిప్‌స్టిక్‌లు, ఫేస్ క్రీమ్‌లతో జాగ్రత్త.. వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి