Chandigarh Mayor : చండీగఢ్ (Chandigarh) నూతన మేయర్ (New Mayor) గా బీజేపీ అభ్యర్థి (BJP candidate) హర్‌ప్రీత్ కౌర్ బబ్లా (Harpreet Kaur Babla) ఎన్నికయ్యారు. ఆప్-కాంగ్రెస్ కూటమి (AAP-Congress alliance) అభ్యర్థి ప్రేమలత (Prem Lata) పై ఆమె విజయం సాధించారు. హర్‌ప్రీత్ కౌర్ బబ్లాకు 19 ఓట్లు రాగా, ప్రేమలతకు 17 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో బబ్లా విజయాన్ని నమోదు చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని అసెంబ్లీ హాల్లో ఇవాళ ఉదయం 11.20 గంటలకు మొదలైన మేయర్ ఎన్నిక 12.19 గంటలకు ముగిసింది.
చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు. ఎన్నికైన కార్పోరేషన్ సభ్యులతోపాటు స్థానిక ఎంపీ కూడా ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఓటు వేస్తారు. వాస్తవానికి చండీగఢ్ కార్పోరేషన్లో ఆప్‌కు 13 మంది, కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యుల బలం ఉంది. బీజేపీకి 16 మంది సభ్యులు, ఒక ఎంపీ ఉన్నారు. అయితే ఆప్-కాంగ్రెస్ కూటమి నుంచి ఇద్దరు సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో బబ్లా విజయం సాధించారు.
#WATCH | BJP candidate Harpreet Kaur Babla wins the Chandigarh Mayor elections. pic.twitter.com/B4CcRqL8Yk
— ANI (@ANI) January 30, 2025
Mahakumbh | తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్, డీజీపీ.. Video
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు
Maha Kumbh Stampede | బారీకేడ్లను తొలగించడంవల్లే తొక్కిసలాట : మహా కుంభమేళా డీఐజీ
Drinking water | ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అడ్డంకి..!