Salwan Momika | 2023లో ముస్లిం దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమైన వ్యక్తి దారుణ హత్య..!
Salwan Momika | క్రిస్టియన్ ఇరాకీ అయిన సాల్వన్ మోమికా 2023లో ఖురాన్‌ను తగులబెట్టి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారనే కేసులో స్టాక్ హోమ్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇంతలో మోమికా హత్యకు గురికావడంతో తీర్పును ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
Salwan Momika : 2023లో స్వీడన్ (Sweden) లో ముస్లింల పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ (Qoran) ప్రతులను తగులబెట్టి ముస్లిం దేశాల్లో తీవ్ర నిరసనలు, ఆందోళనలకు కారణమైన సాల్వన్ మోమికా (Salwan) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం స్వీడన్లోనే గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో అతడు మరణించాడు. ఈ విషయాన్ని స్వీడన్ మీడియా వెల్లడించింది. అక్కడి పోలీసులు కూడా కాల్పుల్లో సాల్వన్ మోమికా మృతిచెందిన విషయాన్ని ధృవీకరించారు.
క్రిస్టియన్ ఇరాకీ అయిన సాల్వన్ మోమికా నాడు ఖురాన్‌ను తగులబెట్టి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారనే కేసులో స్టాక్ హోమ్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇంతలో మోమికా హత్యకు గురికావడంతో తీర్పును ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. సొడర్టల్జీ నగరంలో కాల్పులు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మోమికా నివాసం ఉండే ఇంటి లోపల ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు వెళ్లేసరికి మోమికా రక్తపు మడుగులో పడివున్నాడు. అతడి ఒంటిపై తూటాల గాయాలు ఉన్నాయి. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సాల్వన్ మోమికా ఇస్లాం మతంపై ద్వేశంతో 2023లో స్వీడన్‌లోని పలు ప్రాంతాల్లో ఖురాన్ ప్రతులను తగులబెట్టి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇవాళ ఆయన హత్యకు గురయ్యాడు.
ఇవి కూడా చదవండి..
Congress MP | మహిళపై నాలుగేళ్లుగా అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
Chandigarh Mayor | చండీగఢ్ నూతన మేయర్‌గా హర్‌ప్రీత్ కౌర్ బబ్లా.. Video
Mahakumbh | తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్, డీజీపీ.. Video
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

