న్యూఢిల్లీ, మార్చి 3 : అత్యాధునిక హెలికాప్టర్లు, ‘ష్టిల్’ క్షిపణుల కొనుగోలుకు సంబంధించి రూ.5,083 కోట్ల విలువైన కాంట్రాక్టులపై కేంద్రo తాజాగా సంతకాలు చేసింది. వీటి ద్వారా భారత తీర ప్రాంత రక్షణ కోసం ఆరు అత్యాధునిక తేలిక రకం హెలికాప్టర్లు ‘ఎంకే-3’, ష్టిల్ మిస్సైల్స్‌ను సేకరించబోతున్నది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు చేసినట్టు కేంద్రం మంగళవారం పేర్కొన్నది.
దీంట్లో రూ.2,901 కోట్లు వెచ్చించి ఏఎల్‌హెచ్ రకం ఎంకే-3 హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది. ష్టిల్ క్షిపణులు రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఉపరితలం నుండి గాల్లో ప్రయోగించేవి. శత్రుదేశ విమానాలు, క్షిపణులు, మానవ రహిత వాహనాలు, హెలికాప్టర్లను ఇవి కూల్చివేయగలవు.