Union Budget 2025 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలో జనవరి 31న మొదలు కానున్నాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని పార్లమెంట్‌కు సమర్పిస్తారు. బడ్జెట్‌పై అందరి దృష్టి నెలకొన్నది. చిరు వ్యాపారుల నుంచి బడా పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులతోపాటు మధ్య తరగతి ప్రజలు సైతం బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ని మాత్రమే ప్రవేశపెట్టారు. తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ని నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి బడ్జెట్ సమర్పిస్తారు. అయితే, బడ్జెట్ ఎవరు తయారు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. బడ్జెట్లో ఐదుగురు అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్‌లో ఉన్న ఆ అధికారుల గురించి ఓసారి తెలుసుకుందాం రండి..!
తుహిన్ కాంత్ పాండే 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన 2019 అక్టోబర్ 24 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శిగా పని చేశారు. 2024 సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ ఏడాది జనవరి 9న కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పన్ను రాయిలీలను బ్యాలెన్స్ చేస్తూ దేశ ఆదాయాలు తగ్గకుండా చూస్తారు. పన్ను వ్యవస్థను సరళీకృతం చేస్తూ.. దేశ రెవెన్యూను పెంచే దిశగా తుహిన్ కాంతపాండే బడ్జెట్ కోసం తన ప్రణాళికలను అందించారు. ఆయన ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగింది. ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది.
అజేయ్ సేథ్ 1987 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా.. 2021 ఏప్రిల్ నుంచి కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA) కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను చివరగా ఫైనల్ చేసేది డీఈఏ విభాగమే. భారత ఆర్థిక వృద్ధిని, ఆర్థిక వనరులను జాగ్రత్తగా నిర్వహించడం, వ్యయాల నియంత్రణ తదితర నిర్ణయాలను ఈ విభాగం చూసుకుంటుంది. డీఈఏ కార్యదర్శిగా బడ్జెట్ తయారీ ప్రక్రియ, అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయం, విధాన రూపకల్పన అంశాలను పర్యవేక్షిస్తారు. ఇక అజయ్ సేత్ భారత దేశ తొలి సావరిన్ గ్రీన్ బాండ్ జారీ ప్రకియలో కీలక భూమిక పోషించారు.
మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండేచర్ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వరిస్తున్నారు. ప్రభుత్వ రాయితీలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణ తదితర బాధ్యతలను చూస్తారు. ప్రభుత్వ వ్యయాలు సద్వినియోగం అయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేయడం ఆయన బృందం చూసుకుంటుంది. గోవిల్ గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖలో సేవలందించారు. ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశారు. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ, ఎకానమిక్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు.
వీ అనంత్ నాగేశ్వరన్ భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు. ఆయన ఆసియా పరిశోధనా అధిపతిగా.. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్ జూలియస్ బేర్‌లో గ్లోబల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా పని చేశారు. స్విట్జర్లాండ్, సింగపూర్‌లో క్రెడిట్ సూయిస్సే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (UBS) కోసం పనిచేశారు. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ విద్యార్థుల ప్రొఫెసర్‌గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్‌లో సేవలందించారు. ఈయన సారథ్యంలో ఆర్థిక సర్వే తయారు చేస్తారు. అనంత్ గతంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా సేవలు అందించారు.
అరుణిష్ చావ్లా 1992 బ్యాచ్ బిహార్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగానికి అధిపతిగా నియామకమయ్యారు. ఆర్థిక మంత్రి టీమ్‌లో ఆయన కొత్తగా చేరారు. ఐడీబీఐ బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద పడి ఉన్న ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ఆయన ప్రణాళికలు తయారు చేస్తారు. ఆయన ఇంతకు ముందు రెవెన్యూ కార్యదర్శిగానూ సేవలందించారు. ప్రస్తుతం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వివేక్ నాగరాజు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 19 నుంచి ఈ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రుణాల మంజూరు, డిపాజిట్ల మొబిలైజేషన్, ఫిన్‌టెక్‌లను నియంత్రించడం, బీమా కవరేజీలను పెంచడం, డిజిటల్ ఇన్ఫ్రాను మెరుగుపరచడం తదితర కార్యకలాపాలను చూస్తారు. ఆయన 1993 బ్యాచ్ త్రిపుర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. అమెరికాలోని వాషింగ్టన్లో ప్రపంచబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సలహాదారుగా పని చేశారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో అనుభవం ఉంది. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ పని చేశారు.
Read Aslo :
Economic Survey | ఆర్థిక సర్వే అంటే ఏంటీ..? బడ్జెట్‌కు ముందే ఎందుకు ప్రవేశపెడతారు..?