బుధవారం 23 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 13, 2020 , 03:32:27

నిరాడంబరంగా పంద్రాగస్టు

నిరాడంబరంగా పంద్రాగస్టు

  •     జెండావిష్కరణ చేయనున్న మంత్రులు, విప్‌లు

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరు ఏ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారో ఉత్తర్వుల్లో తెలియజేసింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంద్రాగస్టు వేడుకులకు వీరు జెండావిష్కరణ చేయనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ విప్‌ కే దామోదర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు,  నారాయణపేటలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జెండావిష్కరణ చేయనున్నారు.logo