PBKS vs RCB : ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ హిట్టర్ రిలే రస్సో(61) మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన అతడు భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. 6 పరుగులకే తొలి వికెట్ పడినప్పుడు క్రీజులోకి వచ్చిన రస్సో.. జానీ బెయిర్‌స్టో(27), శశాంక్ సింగ్(25)తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించాడు. దాంతో, 9 ఓవర్లకే పంజాబ్ స్కోర్ 100 దాటింది. ఇంప్యాక్ట్ ప్లేయర్ జితేశ్ శర్మ(5)ను కరణ్ బౌల్డ్ చేశాడు. దాంతో లివింగ్‌స్టోన్ క్రీజులోకి వచ్చాడు. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్..
కొండంత ఛేదనలో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(6) తక్కువకే ఔటైనా.. జానీ బెయిర్‌స్టో(27), లు బౌండరీల మోత మోగించారు. సిరాజ్ బౌలింగ్‌లో రస్సో ఏకంగా 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. వీళ్లిద్దరి జోరుతో పంజాబ్ స్కోర్ 5 ఓవర్లకే 50 దాటింది. అయితే.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో డూప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్‌తో బెయిర్‌స్టో వెనుదిరిగాడు.