ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Komarambheem - Aug 09, 2020 , 02:02:14

శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు డేగ కన్ను

శాంతిభద్రతల పరిరక్షణలో  సీసీ కెమెరాలు డేగ కన్ను

రెబ్బెన : ప్రజల భద్రతే పరమావధిగా పని చేస్తున్న పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు డేగ కన్ను లా పని చేస్తున్నాయి. రెబ్బెన పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రోడ్డు ప్రమాదాలైన ఘటనలో నిందితులను గుర్తించడానికి దోహదపడుతున్నా యి. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ప్రవేశించినా, చోరీలు, అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా సీసీ కెమె రాలను ఏర్పాటు చేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిం చారు. సీసీ కెమెరాల ఆవస్యకతపై వ్యాపారులకు, దుకాణా యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు.

పోలీస్‌స్టేషన్‌లో మానిటర్‌..

మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రెబ్బెన పోలీసులు ప్రధాన కూడళ్లతో పాటు పలు గ్రామాల్లో, షాపుల్లో, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. రెబ్బెన పోలీస్‌ స్టేషన్‌లో మానిటర్‌ అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షి స్తున్నారు. గోలేటి ఎక్స్‌రోడ్‌, రెబ్బెన బస్టాండ్‌ ప్రాంతం, కాగజ్‌ నగర్‌ ఎక్స్‌రోడ్‌, గోలేటిటౌన్‌షిప్‌తో పాటు ప్రముఖ ఆలయా ల్లో శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, నంబాల శ్రీ ప్ర సన్న పరమేశ్వరాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

మండలంలో శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.  ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటు వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎటువంటి సంఘటన జరిగినా వెంటనే తెలుస్తుంది. ముఖ్యంగా దొంగతనాలు అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలైనపుడు ప్రమాదానికి కారణమైన వాహనాలను వెంటనే పట్టుకునే అవకాశం ఉంది. అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
logo