Road accident : మెక్సికో (Mexico) దక్షిణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకున్ నుంచి టబాస్కోకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఎస్కార్సెగా నగరానికి సమీపంలో ఈ ట్రావెల్స్ బస్సును ఓ ట్రక్కు ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 41 మంది సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై టాబాస్కోలోని కమల్కాల్కో మేయర్ ఒవిడియో పెరాల్టా స్పందించారు. ప్రమాద ఘటన తీవ్ర విచారకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు స్పీడ్ లిమిట్‌లోనే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
Delhi BJP | మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.. అప్పాయింట్మెంట్ ఇవ్వండి.. ఎల్జీకి ఢిల్లీ బీజేపీ లేఖ
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లు, 31 మంది మావోయిస్టులు మృతి
Congress | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదు : కాంగ్రెస్
Resign | ఢిల్లీ సీఎం పదవికి అతిషి సింగ్ రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Hyderabad | ఓఆర్ఆర్పై రెచ్చిపోయిన యువకులు.. కార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్‌లు