రామగిరి, మార్చి 18 : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన ‘లా’ కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ విభాగ ఆచార్యులు ఆకుల రవిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. ఆచార్య ఆకుల రవి విశ్వవిద్యాలయానికి సిఓఈగా, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ గా, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఆకుల రవి నియామకం పట్ల పలువురు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.