Congress : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Assembly Elections) ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంపై పంజాబ్ కాంగ్రెస్ (Punjab Congress) పార్టీ స్పందించింది. ఆప్ పరిస్థితి ఢిల్లీలో కొంత బాగుంది కాబట్టి ఆ మాత్రం సీట్లైనా వచ్చాయని, పంజాబ్‌లో అయితే ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వ్యాఖ్యానించింది. 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్‌కు సింగిల్ డిజిట్ కూడా దక్కేది కష్టమేనని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా (Amarinder Singh Raja) అన్నారు.
‘ఢిల్లీలో ఆప్ పరిస్థితి ఇప్పటిదాకా కొంత బాగుంది కాబట్టి సరిపోయింది. పంజాబ్‌లో ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అందువల్ల పంజాబ్‌లో ఆప్ ఢిల్లీ కంటే ఘోరంగా ఓడిపోబోతోంది. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ దక్కడం కూడా కష్టమే’ అని అమరీందర్ సింగ్ రాజా వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 70 స్థానాలకుగాను కేవలం 22 స్థానాల్లోనే ఆప్ గెలిచింది. 48 స్థానాల్లో గెలిచి బీజేపీ అధికారం దక్కించుకుంది.
Resign | ఢిల్లీ సీఎం పదవికి అతిషి సింగ్ రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Hyderabad | ఓఆర్ఆర్పై రెచ్చిపోయిన యువకులు.. కార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్‌లు
Metro Charges | ఏకంగా 50 శాతం పెరిగిన మెట్రో చార్జీలు.. కర్ణాటకలో మరో ధరల పిడుగు