Resign : ఢిల్లీ (Delhi) సీఎం పదవి (CM Post) కి అతిషి మార్లెనా సింగ్ (Atishi Marlena Singh) రాజీనామా చేశారు. ఇవాళ (ఆదివారం) ఉదయం ఢిల్లీ రాజ్ నివాస్ (Raj Nivas) కు వెళ్లిన ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor) వీకే సక్సేనా (VK Saxena) కు తన రాజీనామా లేఖ అందజేశారు. శనివారం వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 48 స్థానాల్లో గెలిచి అధికారం దక్కించుకోగా.. అధికార ఆమ్ ఆద్మీ కేవలం 22 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఈ నేపథ్యంలో అతిషి సింగ్ పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి, అతిషికి సీఎం పదవి కట్టబెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్.. గత సెప్టెంబర్‌లో బెయిల్‌పై బయటికి వచ్చినప్పుడు సీఎం పదవికి రాజీనామా చేశారు. అతిషి రాజీనామా అనంతరం ఎల్జీ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీ 7వ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌పై గెలిచిన పర్వేష్ వర్మకే సీఎం పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగిరాగానే ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.
Hyderabad | ఓఆర్ఆర్పై రెచ్చిపోయిన యువకులు.. కార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్‌లు
Metro Charges | ఏకంగా 50 శాతం పెరిగిన మెట్రో చార్జీలు.. కర్ణాటకలో మరో ధరల పిడుగు