Hyderabad | రాజేంద్రనగర్ : హైదరాబాద్‌లో మరోసారి రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొందరు యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్లు చేశారు. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తూ.. ఒక్కసారిగా కార్లను ఆపి మరీ గింగిరాలు తిప్పారు. ఉన్నచోటే కార్లను రౌండ్‌గా తిప్పుతూ హంగామా చేశారు.
యువకుల కార్ రేసింగ్ కారణంగా ఓఆర్ఆర్పై వెళ్లే పలువురు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, యువకులు చేసిన స్టంట్స్‌కు సంబంధించిన ఓఆర్ఆర్పై ఉన్న సీసీ టీవీలో రికార్డయ్యింది. ఆ ఫుటేజీ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫుటేజీ ఆధారంగా కార్ రేసింగ్ నిర్వహించిన యువకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని శంషాబాద్ ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపారు. అయితే ఓఆర్ఆర్పై పెట్రోలింగ్ తగ్గిపోవడం వల్లే ఇలా రేసింగ్‌లు మొదలుపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహిస్తున్న యువకులు
తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్న యువకులు
నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో స్టంట్ లు చేస్తూ హంగామా చేస్తున్న యువకులు
నడిరోడ్డుపైనే లక్జరీ కార్లతో స్టంట్ లు చేస్తున్న యువకులు pic.twitter.com/i9Pyhzi11Q
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025