కొత్తగూడెం క్రైమ్ : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో నెత్తుటేర్లు పారాయి. పచ్చని ప్రకృతి వనం రుధిరధారలతో ఎరుపెక్కింది. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య పోరు భీకర రూపం దాల్చింది. ఈ రణరంగంలో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఫర్సేఘడ్ ఇలాకాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఈ క్రమంలో నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారాసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. కాసేపటికి తేరుకున్న జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు మూడు-నాలుగు సార్లు విడతలవారీగా కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి జవాన్ల రాక పెరుగుతుండటంతో వారి ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.
కాల్పుల అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలించారు. ఘటన ప్రాంతంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం నలుగురు జవాన్లు గాయపడగా.. వారిలో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు జవాన్లను హెలికాప్టర్ సహాయంతో బీజాపూర్ జిల్లా కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. వారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
ఘటనా స్థలంలో ఇంకా కుంబింగ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన 31 మంది నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఏకే-47, ఎస్ఎల్ఆర్, హింసాస్ రైఫిల్, 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్‌తోపాటు పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించిన ఇతర ఆయుధ, వస్తు, సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ జరుగుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
#WATCH | Chhattisgarh: 2 jawans who got injured in the encounter with security forces in the forests under the National Park area of District Bijapur, brought to a private hospital, in Raipur
As per IG Bastar, P Sundarraj, 31 Naxalites have been killed in the encounter.
— ANI (@ANI) February 9, 2025
#WATCH | Chhattisgarh: IG Bastar, P Sundarraj says, “31 Naxalites have been killed in an encounter under the National Park area of District Bijapur…Two jawans have been injured and were airlifted to the hospital for treatment, both of them are out of danger…2 jawans have… pic.twitter.com/bPsna86RzU
— ANI (@ANI) February 9, 2025
#WATCH | Chhattisgarh CM Vishnu Deo Sai says, “We have been fighting strongly against the Naxaslism since the time we came to power…We praise our jawans for their bravery…” https://t.co/MTpjHQTBDE pic.twitter.com/75MnWdsOJh
— ANI (@ANI) February 9, 2025
Congress | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదు : కాంగ్రెస్
Resign | ఢిల్లీ సీఎం పదవికి అతిషి సింగ్ రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Hyderabad | ఓఆర్ఆర్పై రెచ్చిపోయిన యువకులు.. కార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్‌లు
Metro Charges | ఏకంగా 50 శాతం పెరిగిన మెట్రో చార్జీలు.. కర్ణాటకలో మరో ధరల పిడుగు