Sam Nujoma : నమీబియా (Namibia) వ్యవస్థాపక పితామహుడు, సౌతాఫ్రికా (Sout Africa) నుంచి నమీబియా విముక్తి కోసం జరిగిన స్వాతంత్య్ర పోరాటానికి (Independence fight) నేతృత్వం వహించిన మహనీయుడు, ఆ దేశ తొలి అధ్యక్షుడు (First president) సామ్ నుజోమా (Sam Nujoma) అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. అనారోగ్యంతో గత మూడు వారాలు ఆయన విండ్‌హోక్ (Windhoek) లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
నమీబియాకు 1990లో స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం ఆ దేశ తొలి అధ్యక్షుడిగా సామ్ నుజోమా పనిచేశారు. 1990 నుంచి 2005 వరకు 15 ఏళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఈ విషయాన్ని నమీబియా అధ్యక్ష భవనం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. సామ్ నుజోమా మరణం దేశానికి తీరని లోటు అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆయన మరణవార్త దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది.
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లు, 31 మంది మావోయిస్టులు మృతి
Congress | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదు : కాంగ్రెస్
Resign | ఢిల్లీ సీఎం పదవికి అతిషి సింగ్ రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Hyderabad | ఓఆర్ఆర్పై రెచ్చిపోయిన యువకులు.. కార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్‌లు
Metro Charges | ఏకంగా 50 శాతం పెరిగిన మెట్రో చార్జీలు.. కర్ణాటకలో మరో ధరల పిడుగు