రైతులంటే మీకు చిన్నచూపా?.. దీక్షా శిబిరం వద్ద పోలీస్ బందోబస్తు ఎందుకు
“ఎమ్మెల్యే సారూ.. మీకు రైతులంటే ఎందుకంత చిన్నచూపు.. కాలువ నిర్మించి సాగునీళ్లివ్వాలని 32 రోజుల నుంచి ఎర్రటి ఎండలో రిలే దీక్ష చేస్తుంటే మీకు నవ్వొస్తుందా..” అంటూ పలువురు రైతులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మీమేమన్నా ఉగ్రవాదుల లెక్క కనిపిస్తున్నామా..
- మా ముందు నుంచే కాన్వాయ్‌లో వెళ్లినా.. ఒక్క నిమిషం మమ్మల్ని పలుకరించే ఓపిక లేదా?
- ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుపై రైతుల ఆగ్రహం
- పెద్దలింగాపూర్‌లో 32వ రోజుకు చేరిన రిలేదీక్ష
ఇల్లంతకుంట రూరల్, మార్చి 14: “ఎమ్మెల్యే సారూ.. మీకు రైతులంటే ఎందుకంత చిన్నచూపు.. కాలువ నిర్మించి సాగునీళ్లివ్వాలని 32 రోజుల నుంచి ఎర్రటి ఎండలో రిలే దీక్ష చేస్తుంటే మీకు నవ్వొస్తుందా..” అంటూ పలువురు రైతులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి తాము దీక్ష చేస్తున్న శిబిరం ముందునుంచే ఎమ్మెల్యే తన కాన్వాయ్‌తో వెళ్లారే గానీ.. శిబిరం వద్ద వాహనం నిలుపలేదన్నారు. “మమ్మల్ని పలుకరించేంత ఓపిక లేదా” అని ఆవేదన చెందారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. కాలువ నిర్మించాలని కోరితే ఎమ్మెల్యే ప్రెస్మీట్లో ఎవరో కుక్కలు కూర్చోబెడితే దీక్షలో చేస్తున్నారంటూ అవమానించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
తాము దీక్ష చేస్తున్న శిబిరం వద్ద పోలీసు బందోబస్తు పెట్టించాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. తాము ఏమైనా ఉగ్రవాదులలెక్క కనిపిస్తున్నామా? అని ఆగ్రహించారు. ప్రభుత్వం నుంచి నిజంగానే నిధులు మంజూరు చేయించి ఉంటే ఎమ్మెల్యే నిజాయితీగా రైతుల ముందుకొచ్చి జరుగబోయే అంశాల మీద వివరణ ఇచ్చి ఉండేవారన్నారు. గతేడాది ఎమ్మెల్యే మాటలు నమ్మి మోసపోయామని.. ఇప్పుడు కూడా మోసపోలేమన్నారు. తమను కించపరిచేలా మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కాలువ పనులు ప్రారంభించేంత వరకు దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

