Vishwanath And Sons | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు కథానాయకిగా నటిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో సూర్య మాజీ ఒలింపిక్ షూటర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్ర చుట్టూ తిరిగే భావోద్వేగాలు సినిమాకి హైలైట్ నిలవనున్నాయి. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ వంటి ప్రముఖ తారలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14, 2026 న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.