హనుమకొండ చౌర స్తా, మార్చి 14 : వరంగల్ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఎకానమిక్స్ విభాగానికి చెందిన విశ్రాంత ఆచార్యులు, మాజీ వైస్ చాన్స్‌లర్ ఎన్ లింగమూర్తి(75) శనివారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హనుమకొండ భీమారంలోని తన నివాసంలో మరణించారు.
లింగమూర్తి కాకతీయ విశ్వవిద్యాలయం 10వ వైస్‌చాన్స్‌లర్‌గా నవంబర్ 2007 నుంచి నవంబర్ 2010 వరకు సేవలందించారు. విశ్వవిద్యాలయంలో క్యాంపస్ కాలే జీ ప్రిన్సిపాల్‌గా, యూజీసీ యూని ట్ సమన్వయ అధికారిగా, దూరవిద్య కేంద్ర సంచాలకుడిగా, ఎకానమిక్స్ విభాగాధిపతిగా, సోషల్ సైన్సె స్ విభాగాల డీన్‌గా, పరీక్షల నియంత్రణాధికారిగా, ఖమ్మంలోని పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2011లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు.