హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఆ చరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీ డర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించనున్న సింగిల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారుల నుంచి రూ.6లక్షలు వ సూలు చేస్తున్నదని ఆరోపించారు.
లబ్ధిదారుల నుంచి పైసలు వసూలు చేస్తే బీఆర్ఎస్ ఊరుకోబోదని హెచ్చరించారు. అసెం బ్లీ మీడియా హాల్లో విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సు రభి వాణీదేవి, దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత విలువైన స్థలాల్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారని గుర్తుచేశారు.
సెక్రటేరియట్ చుట్టుపక్కల ప్రాం తాల్లోనూ నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇచ్చారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా జీహెచ్ఎంసీలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే హడావుడి చేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాలకే పరిమితమైందని తలసాని దెప్పిపొడిచారు. ఇందిరమ్మ స్కీమ్ ద్వారా ప్ర భుత్వం రూ. 5లక్షలు వెచ్చిస్తే, రూ.6లక్షలు లబ్ధిదారులు భరించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సకల హంగులతో ప్యాలెస్‌లు కట్టుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపుతున్నారని తలసాని విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కార్ కేసీఆర్‌పై కక్షతో 39వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందజేయాలని డి మాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో కి రాగానే మరో లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఉన్నసిటీని గాలికొదిలి ఫోర్త్‌సిటీ అంటూ ఊదరగొట్టడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రెస్‌మీట్ పెట్టేందుకు అనుమతిలేదని నిరాకరించిన అసెంబ్లీ సిబ్బందిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ గ్రహం వ్యక్తంచేశారు. కొద్దిసేపు మీడియా పాయింట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం వస్తున్నారనే కారణంతో అడ్డుకోవడం సరికాదని స్పష్టంచేశారు. ఇది ఎమ్మెల్యేల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని, ఇలాం టి సంప్రదాయాన్ని ఏనాడూ చూడలేదని మండిపడ్డారు. ఒక్కరోజు ముందే స్పీకర్ నుంచి అనుమతి తీసుకున్నామని పేర్కొన్నారు. కొద్దిసేపటికి అనుమతించడంతో నిరసన విరమించారు.