కిడ్నీ కాపాడుకో.. జీవితాన్ని నిలబెట్టుకో
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. గుండె, మెదడు చురుగ్గా పని చేస్తాయి. హార్మోన్ల సమతుల్యత వల్ల ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల ఆనందంగా ఉంటారు. ఒక్క కిడ్నీల పని తీరు మందగించిందో.. అవయవాలన్నీ డీలా పడిపోతాయ్. అవి ఆరోగ్యంగా ఉంటే శరీరంలోని అవయవాలన్నీ సరిగా పనిచేస్తాయ్.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. గుండె, మెదడు చురుగ్గా పని చేస్తాయి. హార్మోన్ల సమతుల్యత వల్ల ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల ఆనందంగా ఉంటారు. ఒక్క కిడ్నీల పని తీరు మందగించిందో.. అవయవాలన్నీ డీలా పడిపోతాయ్. అవి ఆరోగ్యంగా ఉంటే శరీరంలోని అవయవాలన్నీ సరిగా పనిచేస్తాయ్. మూత్రపిండాలను కాపాడుకోవడం జీవితాన్ని కాపాడుకోవడమే. శరీరంలోని మార్పుల్ని కనిపెట్టుకుంటూ వాటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
కిడ్నీ రోగ పీడితులు లేని ఊళ్లు లేవు. ముదిరితే కానీ బయటపడకపోవడం, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహించడం, అవగాహన లోపం వల్ల కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కిడ్నీ సమస్యల వల్ల ఇతర రోగాలూ వస్తున్నాయి. కొందరిలో కిడ్నీ వ్యాధి ముదిరి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వస్తోంది. సమస్యను గుర్తించకపోతే ఇతర ప్రధాన అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది.
కిడ్నీ సమస్యలు ప్రధానంగా 2రకాలు
మన శరీరంలో జరిగే జీవ క్రియల్లో ఏర్పడ్డ మలినాలన్నీ చేరిన రక్తాన్ని వడకట్టి వేరు చేసే యంత్రాలు కిడ్నీలు. ఇవి విరామం లేకుండా పని చేస్తూనే ఉంటాయి. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు రక్తపోటును నియంత్రిస్తాయి. ఖనిజ లవణాల సమతుల్యతను కాపాడతాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే ఈ విధులన్నీ నెమ్మదిస్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యాన్ని కనిపెట్టుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలి. సాధారణంగా కిడ్నీలకు వచ్చే వ్యాధులను రెండు వర్గాలుగా విభజిస్తారు.
1. క్రానిక్ కిడ్నీ డిసీజ్
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు చాలా నెమ్మదిగా ప్రభావం చూపుతాయి. సమస్య కనీసం మూడు నెలలు దాటితే దానిని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) అంటారు. ఈ దీర్ఘకాలిక మూత్ర పిండ సమస్యలు నెమ్మదిగా ప్రభావం చూపించడం వల్ల వ్యాధి చివరి దశకు చేరినప్పుడు లక్షణాలు బయటపడతాయి. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. అందుకే ఈ సీకేడీని ‘నిశబ్ద వ్యాధి’ అని కూడా అంటారు. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల వల్ల గుండె, మెదడు, పేగులు, రక్తం, ఎముకలు ప్రభావితమవుతాయి.
2. ఎక్యూట్ కిడ్నీ డిసీజస్..
ఆరోగ్యంగా ఉన్న మనిషిలో అకస్మాత్తుగా లేదా అతి తక్కువ సమయంలోనే కిడ్నీ వ్యాధి బారినపడుతుంది. ఉదాహరణకు కిడ్నీ ఇన్ఫెక్షన్, బీపీ తగ్గితే కిడ్నీకి రక్త సరఫరా తగ్గిపోవడం మొదలైనవి. ఇలాంటి సమస్యలను ఎక్యూట్ ట్యుబులర్ నెక్రోసిస్ (ఏటీఎన్) అంటారు. కొన్ని రకాల మందుల వల్ల కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది. కిడ్నీలో ఏర్పడే రాళ్లు లేదా పెయిన్ కిల్లర్స్ ప్రభావంతో ‘పాపిలా’ అనే భాగం విడిపోయి నాళంలో అడ్డుపడుతుంది. అందువల్ల కిడ్నీ పనితీరు ఇంకా తగ్గిపోతుంది. కిడ్నీలో ఉండే ఫిల్టర్లు (గ్లోమరులస్) ఇన్ఫ్లమేషన్కు గురైనప్పుడు ‘గ్లోమలార్ నెఫ్రైటర్స్’ ఏర్పడుతుంది. దీని వల్ల కూడా కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది.

గుండెపై సీకేడీ ప్రభావం
గుండె, కిడ్నీల పనితీరు పరస్పరం ఆధారపడుతుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో ద్రవం పేరుకుపోవడం, రక్తపోటు పెరగడం, రక్తహీనత, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఏర్పడి గుండెపై అదనపు భారం పడుతుంది. అందువల్ల గుండెకు సంబంధించిన ఈ సమస్యలు వస్తాయి.
- గుండె వైఫల్యం
- గుండెపోటు
- కరొనరీ ఆర్టరీ వ్యాధి
- గుండె స్పందనలో అసమానతలు
మెదడుపై సీకేడీ ప్రభావం
కిడ్నీలు, మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని ఇటీవలి పరిశోధనలు మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి, రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. దాంతో మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. సీకేడీ వల్ల ప్రధానంగా వచ్చే మెదడు సంబంధ సమస్యలు
- జ్ఞాపక శక్తి తగ్గడం
- ఏకాగ్రత లోపించడం
- నిద్రలేమి
- ఆందోళన
- నిరాశ
- బ్రెయిన్ స్ట్రోక్
పేగులపై..
మన పేగుల్లో నివసించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటే టాక్సిన్లు ఏర్పడతాయి. అవి రక్తంలోకి చేరి కిడ్నీలపై అదనపు భారం మోపుతాయి. అందుకే పీచు పదార్థాలు అధికంగా ఉండే సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో అవసరం.
రక్తంపై..
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు రక్తంపై కూడా ప్రభావం చూపుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ఎకువగా కనిపించే సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. కిడ్నీలు దెబ్బతింటే రక్తపోటు పెరుగుతుంది. ఈ అధిక రక్తపోటు తిరిగి కిడ్నీలను మరింత దెబ్బతీస్తుంది. ఈ ప్రమాదకరమైన చక్రాన్ని నిలువరించాలంటే రక్తపోటును నియంత్రించాలి.

ఎరిత్రోపోయెటిన్ లోపం
ఆరోగ్యకరమైన కిడ్నీలు ‘ఎరిత్రోపోయెటిన్’ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీల ఆరోగ్యం క్షీణిస్తే ఎరిత్రోపోయెటిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని లోపం వల్ల కలిగే సమస్యలు
- రక్తహీనత
- అలసట
- బలహీనత
- తల తిరగడం
- ఊపిరి ఆడకపోవడం
- పనిపై ఏకాగ్రత తగ్గడం
ఎముకలపై..
క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ మూలకాల సమతుల్యతను కిడ్నీలు నియంత్రిస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే ఈ సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఎముకలు బలహీనపడతాయి.
- ఎముకల నొప్పులు
- కండరాలు పట్టేయడం
- కీళ్ల నొప్పులు
- ఎముకలు బలహీనపడి, చిన్నపాటి గాయానికే విరిగే ప్రమాదం పెరుగుతుంది.
ఇలా కాపాడుకుందాం
1. కిడ్నీ సమస్యల లక్షణాలు త్వరగా కనిపించవు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయూఈ), సీరం క్రియాటిన్, జీఎఫ్ఆర్(గ్లొమర్యులార్ ఫిల్టరేషన్ రేట్) టెస్ట్‌లు చేయించుకోవాలి. జీఎఫ్ఆర్ టెస్ట్ కిడ్నీ పనితీరు తెలియజేస్తుంది. ఈ పరీక్షలతో పాటు బీపీ, షుగర్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి.
2. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి.
3. సమతుల ఆహారం తినాలి.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
5. ధూమపానానికి దూరంగా ఉండాలి.
6. పెయిన్ కిల్లర్స్, సప్లిమెంట్స్ వంటివి సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
7. ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి.
8. మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
9. కాళ్ల వాపు, తీవ్రమైన అలసట, మూత్రంలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్టును సంప్రదించాలి.
మహేశ్వర్‌రావు బండారి …?
డా. రేఖా పాలడుగు
సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

