హైదరాబాద్, జులై 23 (నమస్తే తెలంగాణ): ‘సర్’ప్రక్రియపై సీఎం రే వంత్‌రెడ్డి ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని, క నీస సమీక్షలు నిర్వహించలేదని, ఆయనకు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టులేద ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మా ట్లాడారు. ‘సర్’పై సీఎం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో డబుల్ ఓట్లు ఒకటీ ఉండకూడదనేది బీఆర్ఎస్ ఉద్దేశమని స్పష్టంచేశారు. బీఎల్వోలను ఉద్దేశించి సీఎం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొడంగల్‌లో 60వేల అ నుమానాస్పద ఓట్లను ఈసీ గుర్తించిందంటే ఏస్థాయిలో అక్రమాలు జ రిగాయో అర్థమవుతున్నదని పేరొ న్నారు. సమావేశంలో సుమిత్రానం ద్, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు ముజీబుద్దీన్ పాల్గొన్నారు.