Khairatabad By Election | ఖైరతాబాద్ పోరుకు కారు రెఢీ.. గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం
Khairatabad By Election | ఖైరతాబాద్ ఉప ఎన్నిక పోరుకు గులాబీ సైన్యం సై అంటున్నది. గెలుపే లక్ష్యంగా రేసుకు కారు సిద్ధమవుతున్నది. అపరచాణక్యుడిగా పేరుగాంచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Khairatabad By Election | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఉప ఎన్నిక పోరుకు గులాబీ సైన్యం సై అంటున్నది. గెలుపే లక్ష్యంగా రేసుకు కారు సిద్ధమవుతున్నది. అపరచాణక్యుడిగా పేరుగాంచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. గురువారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సమావేశమయ్యారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, ఇప్పటికే సిద్ధం చేసుకున్న క్షేత్రస్థాయి కార్యాచరణ, అభ్యర్థి ఎంపికపై ఇద్దరు నేతలు చర్చించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయి ఉపఎన్నికకు మార్గం సుగమమైంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గాన్ని తిరిగి దకించుకొనే దిశగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై కేసీఆర్, కేటీఆర్ చర్చించినట్టు తెలిసింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్ఠానం ముందస్తు కసరత్తుకు దిగింది. ఉపఎన్నిక బరిలో బలమైన అభ్యర్థిని నిలబెట్టడంపై గులాబీ దళం దృష్టి పెట్టింది. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. టికెట్ ఆశిస్తున్న నేతల బలాబలాలు, నియోజకవర్గంలో వారి పరిచయాలు, ప్రజా మద్దతు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దానం నాగేందర్‌కు దీటుగా అభ్యర్థిని బరిలో దింపే అంశంపై లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. అభ్యర్థి ఎంపికలో గెలుపు అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రూపొందించిన ప్రణాళికలను పకాగా అమలు చేసే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నది.
గెలుపుపై గులాబీ ధీమా
ఖైరతాబాద్‌లో తమ పార్టీకి ఉన్న పాత బలం, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ సమీకరణాలతో ఉపఎన్నికలో గులాబీ పార్టీ గెలుపు సులువవుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు, నగరాభివృద్ధి, స్థానిక సమస్యలను ప్రధాన ప్రచార అంశాలుగా తీసుకెళ్లే దిశగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నది. తమకు అనుకూలమైన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా తమ గెలుపు నల్లేరుమీద నడకగానే గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఖైరతాబాద్ ఉపఎన్నికతోపాటు త్వరలో జరుగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు, రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియపై కూడా చర్చించినట్టు తెలుస్తున్నది.
క్యాడర్‌కు దిశానిర్దేశం
ఉపఎన్నిక నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. డివిజన్లవారీగా పార్టీ పరిస్థితి, స్థానిక నేతల సమన్వయం, ప్రజల్లోకి వెళ్తే చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలపై కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించినట్టు సమాచారం. ఇటీవల పార్టీ నేతలతో జరిగిన సమావేశాల సారాంశాన్ని కూడా అధినేతకు వివరించినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పార్టీ నిర్వహిస్తున్న నిరసనలు, ఆందోళనలపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

