No UPI Day | అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే!’.. ఎండీఆర్‌పై దేశ వ్యాప్తంగా నిరసన
No UPI Day | యూపీఐ లావాదేవీలపై కేంద్రం విధించనున్న ఎండీఆర్‌పై దేశ వ్యాప్తంగా వ్యాపారుల నిరసన తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ను పాటించాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి.
No UPI Day | న్యూఢిల్లీ : యూపీఐ లావాదేవీలపై కేంద్రం విధించనున్న ఎండీఆర్‌పై దేశ వ్యాప్తంగా వ్యాపారుల నిరసన తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ను పాటించాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి. ఈ నిరసనలో 500 సంఘాల వరకు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు.
దుకాణదారులు కూడా ఈ నిరసనల్లో భాగం కానున్నారు. ఆ రోజు వ్యాపారులు తమ క్యూఆర్ కోడ్లను, స్కానర్లను, సౌండ్ బాక్స్‌లను, ఇతర డిజిటల్ చెల్లింపు పరికరాలను నల్లని వస్త్రంతో కప్పి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలపనున్నారు. ఈ నిరసన గురించి తాను దేశ వ్యాప్తంగా పలు వాణిజ్య సంఘాలతో మాట్లాడానని మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర మంగ్వే తెలిపారు.
అఖిల భారత వినియోగ ఉత్పత్తుల పంపిణీదారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ధైర్యశిల్ పాటిల్ మాట్లాడుతూ రిటైల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు చాలా తక్కువ లాభంతో వ్యాపారాలు నిర్వహిస్తారని తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై అదనపు చార్జీలు విధిస్తే వారి వ్యాపార నిర్వహణ భారమవుతుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోతే తమ ఆందోళనను తీవ్రం చేస్తామని అఖిల భారత వంట నూనె వర్తకుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు శంకర్ థక్కర్ హెచ్చరించారు. రిటైల్ వ్యాపారుల సంక్షేమ సంఘాల సమాఖ్య, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్, అఖిల భారత నగల వర్తకులు, స్వర్ణకారుల సమాఖ్య, అఖిల భారత వంట నూనె వ్యాపారుల ఫెడరేషన్ అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’కు మద్దతు తెలుపుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

