ఢిల్లీ: భారత యువ చెస్ ఆటగాడు మయాంక్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. 17 ఏండ్ల ఈ అసోం చిన్నోడు.. భారత 94వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచి, ఈశాన్య రాష్ర్టాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి చెస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన చెస్ టాలెంట్స్ టోర్నమెంట్‌ను కైవసం చేసుకోవడంతో అతడికి జీఎం హోదా దక్కింది. జీఎంగా అర్హత సాధించడానికి గాను ఈ టోర్నీలో 6.5 పాయింట్లు సాధించాల్సి ఉండగా మయాంక్ ఏకంగా 7 పాయింట్లతో సత్తాచాటి టైటిల్‌తో పాటు జీఎం హోదానూ సాధించాడు.