అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పిడుగులతో అకాల వర్షం ( Rains ) కురిసింది. దీంతో తుళ్లూరులో పిడుగుపాటుకు ( Lightning ) ఒకరు మృతి ( Died ) చెందారు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు. కంకిపాడు, పెనమలూరులో వర్షం పడింది. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో వాతావరణం చల్లబడింది.
ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఓ ఇంటిపై పిడుగుపడింది. ఇంటి టెర్రస్‌పైన పిట్టగోడ పాక్షికంగా దెబ్బతింది. ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్‌కు చేరుకుంది. అల్లూరు జిల్లా జి.మాడుగుల, పెదబయలు మండలాల్లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం పడింది. బాపట్ల జిల్లాలో సైతం కురిసిన భారీ వర్షానికి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.