గురువారం 16 జూలై 2020
International - May 29, 2020 , 16:41:55

సాధించాలనే తపన ఉంటే వైకల్యం అడ్డురాదు!

సాధించాలనే తపన ఉంటే వైకల్యం అడ్డురాదు!

అన్ని సదుపాయాలు ఉన్నవారికి జీవితం విలువ తెలియదు. అవి లేనివారికే భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. దీనికోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. ఈ అమ్మాయి కూడా అంతే. సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా వయోలిన్‌ ప్లే చేస్తున్నది. ‘సాధించాలనే తపన ఉంటే దేన్నైనా సాధించవచ్చు’ అని  ఈ వీడియోను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ సుప్రియ సాహు ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఈ అమ్మాయి పేరు మనమి ఇటో అక. మంచి శరీరాకృతిని ఇచ్చిన దేవుడే యాక్సిడెంట్ చేసి కుడిచేతిని తీసుకెళ్లి పోయాడు. దీంతో ఆమెకు ఒక చేయి మాత్రమే ఉంది. అప్పటికే నర్సింగ్‌ చదువుతున్నది. యాక్సిడెంట్‌ అనంతరం చదువు మానకుండా కంటిన్యూ చేసి నర్స్‌ అయింది. జపాన్‌లో చేయిలేకుండా నర్స్‌ అయిన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్నది. అంతేకాదు ప్రఖ్యాతగాంచిన మంచి స్విమ్మర్‌ కూడా. 2008లో బీజింగ్‌ పారాలింపిక్స్‌లో 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఆమె 4వ స్థానం సాధించింది. అలాగే 2012 లండన్‌లో పారాలింపిక్స్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా సింగిల్‌ హ్యాండ్‌తో వయోలిన్ ప్లే చేస్తూ అందరి హృదయాలను ఆకట్టుకుంటున్నది.


logo