పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
కరోనా | కరోనా మహమ్మారి కారణంగా డిసెంబర్, 2020- జనవరి, 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు దారుణంగా పడిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి.

జాబితాలో ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, చైనా
ఆర్ధిక ఇబ్బందులు, వైరస్ భయాలే ప్రధాన కారణం
భిన్నంగా భారత్లో పెరిగిన జననాల రేటు
పారిస్: ‘గంపెడు పిల్లా పాపలతో చల్లగా ఉండండి’ అని గతంలో పెద్దలు దీవించేవారు. పరిమితమైన వనరులు, జీవనశైలిలో మార్పుల కారణంగా ఇప్పుడు అందరూ ఒకరిద్దరికే పరిమితమైపోతున్నారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా డిసెంబర్, 2020- జనవరి, 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు దారుణంగా పడిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని దేశాల్లో ఈ పరిస్థితి గడిచిన శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా దిగజారినట్టు తెలియడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
కారణాలేమిటి?
- కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోవడంతో ఫ్యామిలీ ప్లానింగ్,
- లాక్డౌన్ నిబంధనల వల్ల లక్షల పెండ్లిళ్లు వాయిదా పడటం,
- వైరస్ భయాల వల్ల దంపతుల కలయికలో తగ్గుదల
వ్యాక్సిన్ వచ్చిందిగా.. పరిస్థితి మారొచ్చా?
టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ, చాలా మంది ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడలేదు. మాంద్యం, ఉద్యోగాలు కోల్పోవడం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దీంతో ఇప్పుడే పిల్లల్ని కనాలని అనుకోవడంలేదని చాలా మంది అనుకొంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఏ దేశంలో ఎలా?
ఇటలీలోని 15 నగరాల్లో 22% వరకు జననాల రేటు తగ్గుదల రికార్డయ్యింది. వందేండ్లలో ఇదే కనిష్ఠం. అలాగే గతంతో పోలిస్తే, చైనాలో 15%, అమెరికాలో 3 లక్షల కంటే తక్కువ జననాలు రికార్డయ్యాయి.
మనదేశంలో భిన్నం
కరోనా సమయంలోనూ భారత్, ఫిలిప్పీన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో భిన్నంగా జననాల రేటులో పెరుగుదల కనిపించింది. గర్భనిరోధక చికిత్సలు-సాధనాల కొరతే ఇందుకు కారణం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

