Today History : ప్రపంచ చరిత్రలో తొలిసారి ఉరిశిక్ష విధింపునకు గురైన వ్యక్తిగా చార్లెస్ బ్రూక్స్ జూనియర్ నిలిచారు. 1982 లో సరిగ్గా ఇదే రోజున ఆయనకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి ఉరిశిక్ష విధించారు. అమెరికాలోని టెక్సాస్‌లో బ్రూక్స్ శరీరంలోకి డ్రగ్స్‌తో కూడిన కాక్టెయిల్ను ఇంజెక్ట్ చేయడం వల్ల అతడి శరీరం మొద్దుబారిపోయి తొలుత పక్షవాతానికి గురయ్యాడు. అనంతరం గుండె వైఫల్యంతో చనిపోయాడు. ఈ ఉరిశిక్ష తర్వాత విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష విధించే ప్రక్రియ మానవీయమైనదా? కాదా? అనే దానిపై సాధారణ ప్రజల్లో, వైద్యుల్లో చర్చకు దారితీసింది. విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి మరణశిక్ష విధించే ఆచారం నేటికీ కొనసాగుతుండటం విశేషం.
డేవిడ్ గ్రెగొరీ అనే ఆటో మెకానిక్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన చార్లెస్ బ్రూక్స్‌కు టెక్సాస్ కోర్టు మరణశిక్ష విధించింది. బ్రూక్స్‌తో పాటు వుడీ లౌడ్రెస్కు కూడా మరణశిక్ష విధించారు. అయితే, లాడ్రెస్ శిక్షను అనంతరకాలంలో కోర్టు తగ్గించింది. బ్రూక్స్‌కు డ్రగ్స్‌తో కూడిన కాక్టెయిల్ను ఇంజెక్ట్ చేసి ఉరిశిక్షను అమలుచేశారు. గ్యాస్, విద్యుత్ షాక్ లేదా ఉరి వంటి ఇతర ఉరి పద్ధతుల కంటే విషపూరిత ఇంజెక్షన్ మరింత మానవీయంగా పరిగణిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లో ఉపయోగించే డ్రగ్ మరణిస్తున్న వారికి నొప్పిని కలిగించదు. చాలా మంది వైద్యులు విషం ఇంజెక్షన్‌ను ఇచ్చి ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకించినప్పటికీ.. ఇది ఇప్పటికీ ఆమోదయోగ్యమైనదిగా పరిగణిస్తున్నారు.
2009: కోపెన్‌హాగన్‌లో వాతావరణ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం
2008: జపాన్ టూర్ టైటిల్ గెలుచుకున్న భారత గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్
1988: ఆర్మేనియాలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించి 25,000 మంది మరణం
1995: కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్-2 సీ ని ప్రయోగించిన భారతదేశం
1992: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్
1972 : అంతరిక్షం నుంచి తొలిసారి భూమి చిత్రాన్ని తీసిన నాసాకు చెందిన అపోలో
1966 : వాతావరణ పరిశోధన నిమిత్తం ఏటీఎస్-1 శాటిలైట్‌ను ప్రయోగించిన నాసా
1949: భారత సాయుధ దళాల జెండా దినోత్సవం ప్రారంభం
1856: భారతదేశంలో అధికారికంగా జరిగిన తొలి హిందూ వితంతు వివాహం
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..