Sai Pallavi | రెండు వారాల గ్యాప్‌లో సాయిపల్లవి రెండు పాన్ ఇండియా సినిమాలు.. హీరోయిన్‌కు ప్లస్సా? నిర్మాతలకు రిస్కా?
Sai Pallavi | ఒక సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలోనే అదే హీరో లేదా హీరోయిన్ నటించిన మరో సినిమా థియేటర్లలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణంగా ఒకే నటుడి సినిమాలు తక్కువ గ్యాప్‌లో విడుదలైతే బాక్సాఫీస్ పరంగా పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది. అయితే స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విషయంలో ఇప్పుడు ఇదే పరిస్థితి కాస్త ఆసక్తికరంగా మారింది.
Sai Pallavi | ఒక సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలోనే అదే హీరో లేదా హీరోయిన్ నటించిన మరో సినిమా థియేటర్లలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణంగా ఒకే నటుడి సినిమాలు తక్కువ గ్యాప్‌లో విడుదలైతే బాక్సాఫీస్ పరంగా పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది. అయితే స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విషయంలో ఇప్పుడు ఇదే పరిస్థితి కాస్త ఆసక్తికరంగా మారింది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు కేవలం రెండు వారాల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సాయిపల్లవికి ఇది నటిగా మంచి అవకాశంగా కనిపిస్తున్నప్పటికీ, రెండు సినిమాల నిర్మాతలకు మాత్రం థియేటర్ల కేటాయింపు, ప్రచార కార్యక్రమాలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం వంటి అంశాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనుండటంతో ఆమె పాత్రపై కూడా భారీ ఆసక్తి నెలకొంది. ‘రామాయణ: పార్ట్ 1’ విడుదలైన సరిగ్గా రెండు వారాల తర్వాత సాయిపల్లవి నటించిన మరో భారీ చిత్రం ‘ఓం: చాప్టర్ 1 – ఉదిరం’ థియేటర్లలోకి రానుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో మమ్ముట్టి, శ్రీలీల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిపల్లవి కూడా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆమె పాత్రలో యాక్షన్, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రెండు సినిమాల మధ్య కేవలం 14 రోజుల గ్యాప్ ఉండటంతో థియేటర్ల కేటాయింపు విషయంలో కొంత ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘రామాయణ: పార్ట్ 1’కు భారీ స్పందన వచ్చి ఎక్కువ కాలం థియేటర్లలో కొనసాగితే, రెండు వారాల తర్వాత విడుదలయ్యే ‘ఓం: చాప్టర్ 1 – ఉదిరం’కు థియేటర్లు సర్దుబాటు చేయడం కొంత సవాలుగా మారవచ్చు.. అయితే ఈ రెండు సినిమాలు సాయిపల్లవికి ఒక విషయంలో ప్రత్యేకమైన అవకాశాన్ని ఇవ్వనున్నాయి. రెండు చిత్రాల్లోనూ ఆమె పాత్రలు ఒకే తరహాలో ఉండవు. ‘రామాయణ: పార్ట్ 1’లో సీతాదేవి వంటి కీలకమైన పౌరాణిక పాత్రలో కనిపించనుండగా, ‘ఓం: చాప్టర్ 1 – ఉదిరం’లో పూర్తిగా భిన్నమైన భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో కూడిన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

