చిత్రకళా రంగంలో కూరెళ్ల శ్రీనివాస్‌కు ప్రతిభా పురస్కారం
చిత్రకళా రంగంలో విశిష్ట సేవలు అందించిన నల్లగొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కూరెళ్ల శ్రీనివాస్‌కు ప్రతిభా పురస్కారం లభించింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ నాంపల్లిలో...
– రూ.30,116 నగదు పారితోషికంతో ఘన సత్కారం
– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారం ప్రదానం
రామగిరి, అక్టోబర్ 03 : చిత్రకళా రంగంలో విశిష్ట సేవలు అందించిన నల్లగొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కూరెళ్ల శ్రీనివాస్‌కు ప్రతిభా పురస్కారం లభించింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై చిత్రలేఖన విభాగంలో ఎంపికైన కూరెళ్ల శ్రీనివాస్‌ను రూ.30,116 నగదు పారితోషికంతో ఘనంగా సత్కరించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు సభకు అధ్యక్షత వహించారు.
పలువురి హర్షం
కూరెళ్ల శ్రీనివాస్ కు పురస్కారం రావడంతో విశ్వకర్మ తేజస్సుని వ్యవస్థాపకుడు పెందోట సోము, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరి చారి, కోశాధికారి తరుణ్ రోజు భీష్మచార్య, గౌరవ అధ్యక్షుడు కొండోజు కృష్ణమాచారి, శ్రీపాద కృష్ణమాచారి, ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి రామకృష్ణ, ప్రముఖ కవులు రచయితలు పెరుమల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, బండారు శంకర్, డాక్టర్ ఈడుకోజు శ్రీనివాసా చారి హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

