IND vs WI : నామమాత్రమైన మూడో వన్డేలో రోహిత్ శర్మ(92) బ్యాటు ఝులింపించాడు. గువాహటిలో సెంచరీతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్ మరో సూపర్ ఇన్నింగ్స్‌తో సెంచరీకి చేరువయ్యాడు. కానీ, ఎనిమిది పరుగుల దూరంలో వికెట్ ఇచ్చేశాడీ ఓపెనర్. దాంతో, రుతురాజ్ గైక్వాడ్(45 నాటౌట్) జతగా అతడు నెలకొల్పిన మూడో వికెట్ శతక భాగస్వామ్యానికి తెరపడింది.
ఛండీగఢ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్() విఫలమైనా, విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌట్ అయినా రోహిత్ శర్మ(92) దంచేశాడు. పవర్ ప్లేలో ధనాధన్ ఆడిన అతడు రుతురాజ్ గైక్వాడ్(45 నాటౌట్) కీలక భాగస్వామ్యం నిర్మించాడు. 10 ఓవర్ల అనంతరం.. వీరిద్దరూ క్రీజునంటుకోగా స్కోర్‌బోర్డు పరుగులు తీసింది.
ఈ క్రమంలోనే రోహిత్ వన్డేల్లో 63వ హాఫ్ సెంచరీ, ఓపెనర్‌గా 10 వేల రన్స్ సాధించి శతకానికి దగ్గరయ్యాడు. కానీ, కీమో పాల్ ఓవర్లో షాట్‌కు యత్నించి చేతికి చిక్కాడు. దాంతో.. మూడో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం గైక్వాడ్, కేఎల్ రాహుల్(1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. 25 ఓవర్లకు స్కోర్… 142-3
Fastest to 1️⃣0️⃣K ODI runs as an opener ✅
6️⃣3️⃣rd ODI FIFTY ✅@ImRo45 is going strong with a crucial knock in New Chandigarh 👏Updates ▶️ https://t.co/PhSJSbvW7C#TeamIndia | #INDvWI | @mflone_ pic.twitter.com/K1qYMobr9Z
— BCCI (@BCCI) October 3, 2026