భారత్‌లో వైరస్ వ్యాప్తికి మతపరమైన, రాజకీయ సమావేశాలే కారణం: డబ్ల్యూహెచ్ఓ
డబ్ల్యూహెచ్ఓ| భారత్‌లో కరోనా విరుచుకుపడటానికి మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలే కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఉధృతి పెరగడానికి సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు మరో కారణమని తెలిపింది.

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విరుచుకుపడటానికి మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలే కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఉధృతి పెరగడానికి సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు మరో కారణమని తెలిపింది. దేశంలో కేసులు అధికంగా నమోదవడానికి గల కారణాలపై డబ్ల్యూహెచ్ఓ ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి మతపరమైన, రాజకీయ పరమైన భారీ సమావేశాలు ప్రధానకారణమని పేర్కొంది. అదేవిధంగా సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు వ్యాప్తిలో ఉండటం, ఆరోగ్య సామాజిక భద్రతా ప్రమాణాలను ప్రజలు పాటించకపోవడం కూడా దేశాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయని తెలిపింది.
బీ.1.1.7, బీ1.612 తదితర రకాల కరోనా వేరస్‌లో భారత్‌లో కేసుల వేగాన్ని పెంచాయని వెల్లడించింది. ప్రమాదకర బీ.1.617 రకాన్ని దేశంలో తొలిసారిగా గతేడాది అక్టోబర్‌లోనే గుర్తించారని పేర్కొంది. అందులో ఉప రకాలు కూడా తర్వాత వెలుగుచూశాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 21 శాతం, బీ.1.617.1 వల్ల, ఏడు శాతం బీ.1.617.2 వల్ల వచ్చినవే ఉన్నాయని అభిప్రాయపడింది. ఇతర రకాలతో పోలిస్తే ఈ రెండూ అధిక సంక్రమణ వేగాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది.
దేశంలో గత రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉత్తరాఖండ్‌లో కుంభమేళా జరిగిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
డీఆర్డీవో ‘ఆక్సీకేర్’లు వస్తున్నాయ్
జూలై దాకా భారీగానే కేసులు
Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
కరోనా వచ్చేదే కాదు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

