Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
Black Fungus | అసలే కరోనా వైరస్ వణికిస్తుంటే.. ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ / మ్యూకోర్మైకోసిస్ ( Mucormycosis ) వచ్చేసింది.

Black Fungus | అసలే కరోనా వైరస్ వణికిస్తుంటే.. ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్మైకోసిస్ ( Mucormycosis ) అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫంగస్ అంత ప్రమాదకరమైనదా? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..

బ్లాక్ ఫంగస్ ( Mucormycosis ) అంటే ఏంటి?
మ్యూకోర్మైకోసిస్ అనేది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే బూజు ( మ్యూకోర్ ) వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ మ్యూకోర్ మట్టిలో, గాలిలో, మనుషుల చీమిడిలో కూడా ఉంటుంది. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.

బ్లాక్ ఫంగస్ ఎలా ప్రభావం చూపిస్తుంది?
సహజసిద్దంగా గాలిలో మ్యూకోర్ అనే ఫంగస్ ఉంటుంది. దీనిని పీల్చినపుడు గాలిద్వారా ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కరోనా నుంచి కోలుకునే సమయంలో తలెత్తే సమస్యల వలన ఆ బ్లాక్ ఫంగస్ కంటి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా కంటిచూపు కోల్పోవాల్సి వస్తుంది. కంటిపై దాడి తర్వాత ఈ ఫంగస్ మెదడు వరకు వ్యాపిస్తుంది. మెదడుకు ఈ ఫంగస్ చేరడం వల్ల బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
| లక్షణాలు ఏంటి? | ఎవరికి ప్రమాదం? |
| కొవిడ్ రోగుల్లో కంటి చూపు మందగించడం కండ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం ముఖం ఒకవైపు భాగం నొప్పిగా ఉండటం తలనొప్పి, పంటి నొప్పి, ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు, వాంతిలో రక్తం రావడం | నియంత్రణ లేని మధుమేహం ఉన్నవారు, స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ కోల్పోయినవారు, ఐసీయూలో దీర్ఘకాలంగా చికిత్సపొందుతున్నవారు, అవయవమార్పిడి చికిత్స చేసుకొన్నవారు. |
కరోనా నుంచి కోలుకున్న వారికే ఎక్కువ ఎందుకు సోకుతుంది?

కొవిడ్-19 కారణంగా ఊపిరితిత్తుల్లో వచ్చే మంటను తగ్గించడానికి స్టెరాయిడ్లను వాడుతున్నారు. తీవ్ర డయాబెటిస్తో బాధపడుతున్న కరోనా రోగులకు కూడా ఈ స్టెరాయిడ్లను ఇస్తున్నారు. ఈ స్టెరాయిడ్ల ప్రభావం వల్ల ఇమ్యూనిటీ తగ్గి రక్తంలో చక్కెరస్థాయులు పెరుగుతున్నాయి. ఇలా రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉందని ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ మనీష్ ముంజాల్ హెచ్చరిస్తున్నారు.

చికిత్స ఎలా?
బ్లాక్ ఫంగస్ అనేది కరోనావైరస్‌లా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ సోకిన తర్వాత లక్షణాలను ముందే గుర్తించి చికిత్స ఇవ్వడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడవచ్చు. మ్యూకోర్మైకోసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను ఇస్తుంటారు. 15 నుంచి 21 రోజుల పాటు ఈ ఇంజెక్షన్లను ఇవ్వాలి. రోగి బరువును బట్టి ఇవి రోజుకు 6 నుంచి 9 ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోగి ముక్కు నుంచి ఫంగస్‌ను తొలగించేందుకు శస్త్ర చికిత్స కూడా చేస్తుంటారు. ఆపరేషన్ తర్వాత కూడా ఈ ఇంజెక్షన్లను కొనసాగిస్తారు.

ఈ జాగ్రత్తలు అవసరం
- రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా చూసుకోవాలి.
- స్టెరాయిడ్లను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.
- యాంటీ బయాటిక్స్/యాంటీ ఫంగల్ ఔషధాలను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.
- మ్యూకోర్మైకోసిస్ లక్షణాలను అలక్ష్యం చేయవద్దు. కొవిడ్ రోగుల్లో ముక్కు దిబ్బడ ఉంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనుకోవద్దు. వెంటనే పరీక్షలు చేసుకోవాలి.
- బహిరంగ ప్రదేశాలు, దుమ్ము, ధూళి ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరి ధరించాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?
COVID-19 doubts : ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా?
COVID Vaccine : వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? గుండెజబ్బులు, షుగర్ ఉంటే టీకా తీసుకోవచ్చా?
Coronavirus Recovery : కరోనా తగ్గినా వ్యాయామం చేయాల్సిందే
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID-19 doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
Coronavirus Recoveryబోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Black Fungus
- mucormycosis
RELATED ARTICLES
తాజా వార్తలు
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

