COVID Vaccine : వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? గుండెజబ్బులు, షుగర్ ఉంటే టీకా తీసుకోవచ్చా?
COVID Vaccine | కరోనాను కట్టడి చేయడం కోసం వైద్య విధానానికి అందుబాటులో ఉన్న ఏకైక అస్త్రం టీకా. కానీ, దీనిపై సవాలక్ష అనుమానాలు ప్రజలలో ఉన్నాయి.

COVID Vaccine | కరోనాను కట్టడి చేయడం కోసం వైద్య విధానానికి అందుబాటులో ఉన్న ఏకైక అస్త్రం టీకా. కానీ, దీనిపై సవాలక్ష అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. కొందరు టీకా గురించి తోచిన రీతిలో అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ పలు అపోహలకు కారణమవుతున్నారు. ఏ వ్యాధులు ఉన్నవాళ్లయినా, ఎలాంటి మందులు వేసుకుంటున్న వారైనా నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చునని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన పలు సందేహాలు, వాటికి సమాధానాలను ఇక్కడ చదవండి.

గుండెజబ్బులు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నిరభ్యంతరంగా. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్లకు కరోనావల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి, వారు వీలైనంత త్వరగా టీకా వేసుకోవాలి.
వ్యాక్సినేషన్‌కు ముందు రక్తం పలుచబడే ఔషధాలను ఆపాల్సి ఉంటుందా?

సాధారణంగా గుండె రుగ్మతలు ఉన్నవాళ్లు వాడే మందులు రక్తం పలుచబడేలా చేస్తాయి. అయితే, ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు మినహా మిగతావారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
యాంటీ ప్లేట్లెట్స్ (ఆస్పిరిన్, క్లొపిడోగ్రెల్ మొదలైనవి)
వీటిని తీసుకునేవారు ఆపాల్సిన పన్లేదు.

యాంటీ కొవాగ్యులెంట్స్ (అసిథ్రోమ్, వార్ఫరిన్ తదితరమైనవి)
వీటిని వాడేవాళ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే, వ్యాక్సినేషన్‌కు ముందు పీటీ-ఐఎన్ఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఐఎన్ఆర్ లెవెల్స్ మూడుకన్నా తక్కువగా ఉంటే, మందులు మానేయకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుడి
సూచన మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎన్ఓఏసీ (న్యూయర్ యాంటీ కొవాగ్యులెంట్)
వ్యాక్సిన్ తీసుకున్నా ఈ మందులు ఆపాల్సిన అవసరం లేదు.
పైన పేర్కొన్న డ్రగ్స్ వాడేవారికి సహజంగానే రక్తం పలుచగా ఉంటుంది. వాళ్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు సూది గుచ్చిన చోట మూడునుంచి ఐదు నిమిషాలు దూదితో అదిమి పెట్టుకుంటే సరిపోతుంది. రక్తం బయటకు రాకుండా నివారించడానికి ఇలా చేయాల్సి ఉంటుందంతే.
కొవిడ్ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, రక్తప్రసరణ లోపాలు తలెత్తుతాయని అంటున్నారు. ఎంతవరకు నిజం?

వైరస్ తీవ్రతనుబట్టి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల హృదయ ధమనులలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంది. అది గుండెపోటుకు దారి తీయవచ్చు. కాబట్టి, కరోనా లక్షణాలు ఉన్నప్పుడు ఛాతీలో అసౌకర్యంగా అనిపించినా, నొప్పి ఎక్కువగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వ్యక్తుల్లో వ్యాక్సినేషన్ తర్వాత రక్తం గడ్డ కట్టడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయా?

వ్యాక్సిన్‌తో ఈ సమస్య తలెత్తదు. రక్తం గడ్డకట్టే వీఐపీఐటీ (వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ప్రోథ్రోంబాటిక్ థ్రోంబోసైటోపీనియా) రిస్క్ చాలా అరుదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గుండె జబ్బు బాధితుల్లో బ్లడ్‌క్లాట్ అయిన దాఖలాలు లేవు. అందుకే, ఎలాంటి అపోహలకూ తావు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
డయాబెటిస్, అధిక రక్తపోటు వ్యాధిగ్రస్థులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
ఎలాంటి అనుమానాలూ వద్దు. తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా డయాబెటిస్, బీపీ పేషెంట్లు మందులను ఆపాల్సిన పన్లేదు.

బైపాస్, స్టెంట్ సర్జరీ జరిగిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ తీసుకోవాలి?
సాధారణంగా అయితే, సర్జరీ జరిగిన వారం తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే, చికిత్స అందించిన డాక్టర్ సూచన మేరకు తుది నిర్ణయం తీసుకోవాలి.

మిగిలిన వారితో పోలిస్తే హృద్రోగులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా?
వైరస్ ఎవరికైనా సోకవచ్చు. అయితే, ఒక్క విషయం.. గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవాళ్లకు వైరస్ సోకితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయినా, వీరిలో లక్షణాలు త్వరగా తెలుస్తాయి. సాధారణ వ్యక్తులకన్నా ఇన్ఫెక్షన్ అధికంగా ఉంటుంది.

– డాక్టర్ జి. రమేష్
సీనియర్ ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
Coronavirus Recoveryబోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

