e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఆరోగ్యం COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

COVID-19 doubts | క‌రోనా వైర‌స్‌పై ఇప్ప‌టికీ ఎన్నో సందేహాలు !! అస‌లు వైర‌స్ ఎలా వ్యాప్తి చెందుతుంది? కొవిడ్‌-19 ( COVID-19 ) సోక‌కుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే వాటిపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్త‌లు తిరుగుతున్నాయి. అయితే వాటిలో ఏవి నిజ‌మో !! ఏవి అబ‌ద్ద‌మో !! తెలియ‌క కొద్దిమంది జ‌నాలు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఇంకొంద‌రు అయితే సోష‌ల్ మీడియాలో చెప్పే చిట్కాలు పాటించి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనాపై ఉన్న కొన్ని సందేహాలు, వాటికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( WHO ) స‌హా ఇత‌ర వైద్య నిపుణులు ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు చూద్దాం..

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?
COVID-19 doubts

దోమలు, ఈగల ద్వారా వైరస్‌ సంక్రమిస్తుందా?

దోమలు, ఈగల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. కేవలం వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపిర్ల ద్వారా ఇతరుల శరీరాల్లోకి వైరస్‌ వెళుతుంది.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

బ‌ట్ట‌ల ద్వారా క‌రోనా సోకుతుందా?

ప్ర‌తిరోజు స్నానం చేసే ముందు బ‌ట్ట‌ల‌ను వేడి నీటిలో నాన‌బెట్టి డిట‌ర్జెంట్‌తో ఉత‌కాలి. బ్లీచింగ్ పౌడ‌ర్ వేసి కూడా ఉత‌క‌వ‌చ్చు. ఉతికిన బ‌ట్ట‌ల‌ను ఎండ‌లోనే ఆరేయాలి.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

ఆల్కహాల్‌ తీసుకుంటే కరోనా రాదా?

ఆల్క‌హాల్ తాగితే క‌రోనా రాదు అన్న దానిలో ఏ మాత్రం వాస్త‌వం లేదు. ఆల్క‌హాల్ తాగ‌డం ఎప్ప‌టికీ ప్ర‌మాద‌క‌ర‌మే. క‌రోనా సోక‌కుండా ఉండాలంటే త‌ర‌చూ చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి. మాస్కులు ధ‌రించాలి. జ్వ‌రం, ద‌గ్గు ఉన్న వారికి వీలైనంత వ‌ర‌కు దూరంగా ఉండ‌టం మంచిది.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

డిజిట‌ల్ థ‌ర్మోమీట‌ర్ల ద్వారా కొవిడ్ పేషెంట్ల‌ను గుర్తించ‌వ‌చ్చా?

శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎంత ఉందో తెలుసుకోవడానికి మాత్ర‌మే థ‌ర్మోమీట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేత‌ప్ప వీటితో కొవిడ్‌-19 సోకిందో లేదో నిర్ధ‌ర‌ణ అవ్వ‌దు. క‌రోనా సోకిన వారికి జ్వ‌రం కూడా వ‌స్తుంది కాబ‌ట్టి ఎక్కువ శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు గుర్తించేందుకు థ‌ర్మ‌ల్ స్కానర్ల‌ను వాడుతున్నారు.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

25 డిగ్రీల కన్నా ఎక్కువ ఎండ వల్ల వైరస్‌ సోకదా?

క‌రోనా వైర‌స్ ఏ వాతావ‌ర‌ణంలో అయినా వ్యాప్తి చెందుతుంది. ఉష్ణోగ్ర‌త‌ల‌కు క‌రోనా సోక‌డానికి సంబంధ‌మే లేదు. అధిక ఉష్ణోగ్ర‌త ఉండే దేశాల్లో కూడా క‌రోనా కేసులు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి క‌రోనా సోక‌కుండా ఉండేందుకు వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌తో పాటు క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌డం మంచిది. ఎప్ప‌టిక‌ప్పుడు చేతులు, ముఖం శుభ్రంగా క‌డుక్కోవాలి. ద‌గ్గిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు చేతిని అడ్డుపెట్టుకోవాలి. మాస్కు ధ‌రించాలి.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

యూవీ బ‌ల్బు కాంతి ద్వారా క‌రోనాను నాశ‌నం చేయొచ్చా?

యూవీ బల్బుల నుంచి వెలువడే యూవీ కిరణాల తీవ్రతకు ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్‌ నశిస్తుందని న్యూయార్క్‌లోని అమెరికన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ టెల్‌అవివ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే యూవీ కాంతి కిర‌ణాలు నేరుగా మ‌నిషి శ‌రీరంపై ప‌డితే చాలా ప్ర‌మాదం. కాబ‌ట్టి చేతులు, శ‌రీరం ఉప‌రిత‌లంపై చేరిన క‌రోనావైర‌స్‌ను నాశ‌నం చేసేందుకు యూవీ కిర‌ణాలు వాడ‌టం శ్రేయ‌స్క‌రం కాదు.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

ప‌సుపు, వెల్లుల్లి తింటే క‌రోనా రాదా?

పసుపు, వెల్లుల్లిలో యాంటీ మైక్రోబ‌యాల్ గుణాలు ఉంటాయి. కాబ‌ట్టి వీటిని తిన‌డం ఆరోగ్యానికి మంచిదే. అయితే పసుపు, వెల్లుల్లి తిన‌డం ద్వారా క‌రోనా రాద‌నడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

10 సెకండ్లు శ్వాస బిగబ‌ట్ట‌గ‌లిగితే క‌రోనా లేన‌ట్లేనా?

శ్వాస పీల్చుకోకుండా పది సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం బిగబట్టి ఉన్నంత మాత్రాన మనలో కరోనా వైరస్‌ లేనట్లేనని చెప్పలేం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా లక్షణాలు ఉన్నవారు ఆర్టీపీసీఆర్‌ లేదా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోవాలి.

COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

బూట్ల ద్వారా కరోనా వస్తుందా?

బూట్ల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమించే అవకాశం చాలా తక్కువ. కానీ చిన్నపిల్లలు ఇంట్లో నేల మీద ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి బూట్లను ఇంటి ముందే వదిలేయడం మంచిది. బూట్ల లోపల ఉండే క్రిములకు సాధ్యమయినంత దూరంగా ఉండడమే మేలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?

COVID Vaccine : వ్యాక్సిన్ ఎవ‌రు తీసుకోవ‌చ్చు? గుండెజ‌బ్బులు, షుగ‌ర్ ఉంటే టీకా తీసుకోవ‌చ్చా?

Coronavirus Recovery : క‌రోనా త‌గ్గినా వ్యాయామం చేయాల్సిందే

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

COVID-19 doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?

Coronavirus Recoveryబోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
COVID-19 doubts : ఆల్క‌హాల్ తీసుకుంటే క‌రోనా రాదా?

ట్రెండింగ్‌

Advertisement