గద్వాల, మే 26 : గద్వాల మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు మట్టి దందా చేసే నాయకులకు వత్తాసు పలుకుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి మాఫియా ప్రభుత్వ భూముల్లో అడ్డగోలు తవ్వకాలు చేస్తున్న పట్టించుకోవడం లేదనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంతో గద్వాలలో మట్టి మాఫియాకు ఎదురు లేకుండాపోయింది.
గద్వాల మండలంలో గతంలో నదిఅగ్రహారం, అనంతపురం, జమ్మిచేడ్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో మట్టిని అడ్డగోలుగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారంరోజులుగా గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో చెరువు పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎవరికి కనిపించని విధంగా మట్టి మాఫియా గుట్టలను స్వాహా చేస్తూ వందల టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. మట్టి మాఫియాను గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని మీ అంతూ చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అడ్డగోలు తవ్వకాల ఈ విషయం అధికారులకు తెలియకపోవడం కోసమెరుపు.

మట్టి దందాతో..ప్రభుత్వ ఆదాయానికి గండి
గద్వాల మండలంలో దర్జాగా మట్టి దందా కొనసాగుతున్నది. ప్రభుత్వ భూముల్లో అడ్డగోలు తవ్వకాలు చేస్తూ టిప్పర్ మట్టిని రూ.6వేల నుంచి రూ.7వేల వరకు విక్రయిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకపోవడంతో పెద్దఎత్తున ప్రభు త్వ ఆదాయానికి గండిపడుతుం ది. ప్రతి రోజూ మండలంలో సాయంత్రం అయిందంటే మట్టి టిప్పర్లు ముల్కలపల్లి శివారు నుంచి పట్టణంలోకి ప్రవేశించి తెల్లార్లు దందా కొనసాగిస్తున్నాయి.
ఇష్టానుసారం గా తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆయా శాఖల అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. మండలంలో మట్టి మాఫి యా అక్రమంగా తవ్వకాలు చేప ట్టి గృహనిర్మాణాలకు, రియల్ఎస్టేట్ వెంచర్లుకు మట్టిని తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా రోజు టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో ముల్కలపల్లి శివారులో గుట్టలు కరిగిపోయాయి. టిప్పర్లు తిరగడంతో గద్వాల వర కు రోడ్లన్నీ పాడైపోయాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మట్టి అక్రమ రవాణపై మైనిం గ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించక పోవడంతో పలు ఆరోపణలు వస్తున్నాయి. ముల్కలపల్లి శివారులో మట్టి మాఫియా పెద్ద గుట్టను చెరబట్టి మట్టిని తీసుకెళ్లడంతో పెద్ద గోతులు పడ్డాయి.

ఇంత మట్టి తవ్వకాలు చేపట్టి విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుంది. వాస్తవంగా ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ, మైనిం గ్ శాఖల అనుమతితో పాటు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించా ల్సి ఉంటుంది. మట్టిని తరలించే మాఫియా అవేవి లే కుండా జోరుగా తవ్వకాలు చేపట్టి ప్రభు త్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మట్టి మాఫి యా అధికారులతో కుమ్మకై ప్రభుత్వ భూ ముల్లోని మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై నిఘా ఉంచి ప్ర భుత్వ సంసదను కాపాడాలని ప్రజలు కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.