బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 14:16:25

అద్దె కట్టమన్నందుకు రూమ్‌మేట్స్‌ను హత్య చేసిన యువకుడు

అద్దె కట్టమన్నందుకు రూమ్‌మేట్స్‌ను హత్య చేసిన యువకుడు

న్యూ ఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని  రఘుబీర్‌నగర్‌లో 23 ఏళ్ల యువకుడు తన ఇద్దరు రూమ్‌మేట్లను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఆజమ్‌(45), అమీర్‌ హసన్‌(46) గత కొన్నేండ్ల నుంచి వృత్తిరిత్యా ఢిల్లీలోని రఘుబీర్‌నగర్‌లో రూ.4 వేలకు ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో యూపీలోని అమ్రోహ గ్రామానికి చెందిన 23 ఏండ్ల సకీర్‌ కూడా వీరితో కొన్నాళ్ల పాటు రూమ్‌లో ఉన్నాడు. 

లాక్‌డౌన్‌ కారణంగా సకీర్‌ తన సొంత గ్రామానికి వెళ్లి నాలుగు నెలల తరువాత ఇటీవల తిరిగి రూమ్‌కు వచ్చాడు. అయితే అతడు తన గ్రామంలో బస చేసిన నాలుగు నెలలు కూడా అద్దె చెల్లించమని సకీర్‌ను రూమ్‌మేట్స్‌ అడిగారు. తాను ఇంటి వద్ద ఉంటే ఇక్కడ అద్దె ఎందుకు చెల్లించాలని సకీర్‌ మిగిలిన ఇద్దరితో గొడవకు దిగాడు. వాగ్వాదం తీవ్రం కావడంతో ఒకరిని ఒకరు తీవ్రంగా దూషించుకొని, అద్దె చెల్లించకపోతే రూమ్‌ నుంచి వెళ్లిపోవాలని సకీర్‌ను రూమ్‌మేట్స్‌ ఆదేశించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సకీర్‌ ఆగస్టు31న ఆజమ్‌, అమిర్‌ నిద్రిస్తున్న సమయంలో ఇద్దరిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి సొంత గ్రామానికి పారిపోయాడు. 

ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. నిందితుడిని మంగళవారం అతడి స్వగ్రామంలో అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo