ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
Fingers colors: అమెరికాకు చెందిన మోనికా అనే ఓ మహిళకు విచిత్రమైన సమస్య ఉంది. ఆమె చేతివేళ్లు

న్యూయార్క్: అమెరికాకు చెందిన మోనికా అనే ఓ మహిళకు విచిత్రమైన సమస్య ఉంది. ఆమె చేతివేళ్లు రంగులు మారిపోతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఆమె చేతి వేళ్లలో రెండు రంగులు మారుతాయి. మధ్య వేలు, దాని పక్కన ఉండే ఉంగరం వేలు చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే తెల్లగా మారిపోతాయి. అవి అలా కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. కాసేపయ్యాక మళ్లీ సాధారణ రంగులోకి అంటే ఆమె శరీరపు రంగులోకి మారిపోతాయి.
ఈ విషయాన్ని మోనికా కుమార్తె జూలీ తన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. రంగుమారిన తన తల్లి చేతివేళ్ల ఫొటోను పోస్ట్ చేసింది. మోనికా రంగులు మారే వేళ్లకు సంబంధించిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. మోనికాకు ఉన్న అరుదైన వ్యాధి వల్లే ఇలా ఆమె వేళ్లు రంగులు మారతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇదొక అరుదైన చర్మవ్యాధి అని, ఈ వ్యాధి పేరు రెయినాడ్స్ సిండ్రోమ్ అని తెలిపారు.
ఈ వ్యాధి ఉన్న వారి చర్మం కింద ఉండే అతి సన్నని రక్తనాళాలు కొన్ని సందర్భాల్లో మరింత సన్నగా మారిపోతాయనీ, దాంతో రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడి ఆ ప్రాంతంలోని చర్మం మొత్తం పాలిపోయినట్టు అవుతుందని పేర్కొన్నారు. చల్లని వాతావరణం కారణంగా మోనికా చేతివేళ్లలో కూడా ఇదే జరిగి అవి తాత్కాలికంగా రంగు మారుతుండవచ్చన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్‌లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

