e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని ఏం చేయబోతున్నారంటే..?

ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని ఏం చేయబోతున్నారంటే..?

ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని ఏం చేయబోతున్నారంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. నిన్నగాక మొన్న జరిగినట్లు అనిపించే ఈ విషాదం జరిగి అప్పుడే 365 రోజులు గడిచిపోయింది. అయినా కూడా ఇప్పటికీ అభిమానులు ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణవార్త ఇంకా పచ్చిగానే ఉంది. పైగా చనిపోయి ఏడాది అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈయన మరణం మిస్టరీగానే ఉండిపోయింది కానీ ఏం తేల్చలేకపోయారు.

అటు ముంబై పోలీసులు.. ఇటు సిఐడి చివరికి ఏం చేయలేకపోయారు. దాంతో అభిమానులు దీనిపై మండి పడుతున్నారు. మరోవైపు సుశాంత్ తొలి వర్ధంతి సందర్భంగా ఈ మధ్యే మాజీ ప్రియురాలు అంకిత లోఖండే.. చనిపోయే వరకు ఉన్న ప్రియురాలు రియా చక్రవర్తి కూడా సుశాంత్‌ను గుర్తు చేసుకున్నారు.ఇదంతా ఇలా ఉంటే సుశాంత్ చనిపోయే నాటికి ముంబైలోని బాంద్రాలో ఉన్నాడు. అక్కడే ఏడాదిగా ఉంటున్నాడు. బాంద్రాలో ఈయన ఆ అపార్ట్ మెంట్ కోసం నెలకు 4.5 లక్షలు చెల్లిస్తున్నాడు. మూడేళ్ళు ఆ ఇంటిని లీజుకు తీసుకున్నాడు.

- Advertisement -

ముందుగానే కొంత మొత్తం కూడా ఓనర్ కు చెల్లించాడు సుశాంత్. అయితే అనుకోని విధంగా అక్కడే ప్రాణాలు కూడా తీసుకున్నాడు సుశాంత్. ఆ ఇంటిని చాలా బాగా చూసుకున్నాడు. ముఖ్యంగా తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకున్నాడు. టెలిస్కోప్ కూడా కొనుక్కొని అక్కడే ఉంచుకున్నాడు సుశాంత్‌.దీని విలువ కూడా దాదాపు 50 లక్షలకు పైగానే ఉంటుంది. బుక్స్, ఖరీదైన ఇంటీరియర్ ఇలా ప్రతీ ఒక్కటి ఆ ఫ్లాట్ లో ఉన్నాయి.

అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నుంచి బాంద్రాలో అపార్టుమెంట్‌ ఖాళీగానే ఉంటోంది. ఇప్పటి వరకు ఈ డూప్లెక్స్ ఫ్లాట్‌లోకి ఎవరూ రాలేదు. ఇందులో ఒక హాల్, మూడు బెడ్ రూమ్‌లు, ఒక కిచెన్ ఉన్నాయి. ఏడాదిగా ఖాళీగా ఉండటంతో ఇప్పుడు దాన్ని అద్దెకు ఇవ్వాలని చూస్తున్నారు ఓనర్లు. 2021 డిసెంబర్‌తో సుశాంత్ లీజు కాలం ముగియనుంది. అందుకే మళ్లీ రెంట్ ఇవ్వనున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన ఇల్లు కావడంతో అందులోకి రావడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. అందుకే సుశాంత్ చెల్లించిన దానికంటే లక్ష రూపాయలు తక్కువ రెంట్ కే ఇవ్వడానికి చూస్తున్నారు సదరు ఇంటి ఓనర్లు.

ఇవి కూడా చదవండి..

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

విజ‌య్ సేతుప‌తితో ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌లు..!

అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!

టాలీవుడ్ క‌మ్ బ్యాక్ త్వ‌ర‌లో..కైరా ట్వీట్

పూరీ జగన్నాథ్ ప‌క్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని ఏం చేయబోతున్నారంటే..?
ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని ఏం చేయబోతున్నారంటే..?
ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని ఏం చేయబోతున్నారంటే..?

ట్రెండింగ్‌

Advertisement